💥💥శ్రీ దత్త స్తవం💥💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః 🌹🙏


💥సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయ పూర్వక నమస్కారము.

అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి "అత్రి మహాముని" పుత్రుడై జన్మించి, "శ్రీ దత్తాత్రేయుడు" అని పేరు పొందాడు.

మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు.

స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూఉంటాడు.


💥మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తొలగుతాయి.


అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి.


ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది.

అపుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిధ్యయని తేలిపోతుంది.

సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం.

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸


💥💥శ్రీ దత్త స్తవం💥💥


దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం | ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || 1 ||


🍁భక్తుల యందు పుత్రప్రేమను కలిగి అపార ప్రేమతో వరములు ఇచ్చి, పరబ్రహ్మ స్వరూపం అయి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయస్వామి నన్ను రక్షించు.


దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం |

సర్వ రక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || 2 ||


🍁దీనుల,ఆర్తుల యందు బంధువు, కరుణా సముద్రుడు, అందరినీ రక్షించే దయ తత్వం కలిగి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం |

నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || ౩ ||


🍁శరణాగతి చెందిన దీనులకు కల్పవృక్షం, సర్వవ్యాప్తుడు అయిన నారాయణుడు, ఆప్త పరాదీనుడు  అయి  తలచిన వెంటనే  ప్రత్యక్షం మయ్యే శ్రీదత్తాత్రేయస్వామి నన్ను రక్షించు.


సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం

సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || 4 ||


🍁అన్ని జ్ఞాన సంబంధ అనర్దాలు తొలగించి, శుభములు ప్రసాదించి, కష్టాలు తొలగించి, ఐహిక కోసం ఉపాసన చేసినా, పారమార్ధిక ఫలం ప్రసాదించి తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం |

భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || 5 ||


🍁బహ్మజ్ఞానం వృద్ది చేసేవాడు, ధర్మ తత్వం, జ్ఞాన తత్వం, ధర్మ జ్ఞానం, తపస్సు వృద్ది చేసి భక్తుల కోరిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః

తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || 6 ||


🍁పాపములను శమింప చేసి జ్ఞాన తపస్సు అనే జ్యోతిని వెలిగించి ఆద్యాత్మిక, ఆది భౌతిక, దైవిక తాపాలు జ్ఞాన దీప్తితో తొలగించి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీదత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం |

విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || 7 ||


🍁సుఖ ప్రాప్తి, దుఖ పరిహారం అనే సర్వ రోగములను నివారించి, సర్వ ఆద్యాత్మిక, లౌకిక పీడలు నివారించి, జన్మ, సంసార బంధములను తొలగించి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం |నిశ్శ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు || 8 ||


🍁సంసార బంధం నుంచి రక్షించి, జన్మ పరంపరలను హరించి, మానవ జీవిత అంతిమలక్ష్యమును అనుగ్రహించి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీదత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యస్తవం |భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||9 ||


🍁శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత "దత్తాత్రేయ స్తవం" పారాయణం చేసినవారికి జయం, లాభము, సంపద, కోరికలు, భోగములు, మోక్షము, దత్తాత్రేయ కృపతో శ్రీఘ్రంగా లభిస్తాయి.


శ్రీ దత్తాత్రేయస్వామికి అంకితం.

తెలుగులోకి అనువాదన: రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు