💥శివపురాణం – లింగావిర్భావం💥🙏
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
💥🔱💥🔱💥🔱💥🔱
💥శివపురాణం – లింగావిర్భావం💥🙏
💥ఒకనాడు లింగావిర్భావ కాలము నందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి
"నేను అధికుడను అంటే నేను అధికుడను" అని వాదోపవాదం జరిగింది.
వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్ర స్థాయిని పొందుతుంటే దేవతల మొర విన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారి మధ్య ఆవిర్భవించాడు.
దాని ఆది కనుక్కోవడానికి #శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు.
#బ్రహ్మగారు హంస వాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు.
బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీపుష్పం (మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది.
దానిని "నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగారు. అపుడు మొగలిపువ్వు "ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?" అని అడిగింది.
అపుడు బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగారు. ఏమిటి కావాలి మీకు? అని అడిగింది మొగలిపువ్వు.
ఆయన క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు.
నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. చెప్తాను అన్నది మొగలి పువ్వు.
బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగారు. అపుడు విష్ణువు "నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను" అన్నారు.
అపుడు బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను.
సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు.
ఇప్పుడు జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో... బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు.
కాబట్టి నీకు భూమియందు పూజ లేకుండుగాక!
కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది.
ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు.
మహావిష్ణువు నేను చూడలేదు అని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి.
ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే "బ్రహ్మోత్సవం" అని బ్రహ్మ గారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది.
కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక!
అప్పుడు కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది.
నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను అని చెప్పాడు.
అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి
ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ.
ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే "మహాశివరాత్రి"
కాబట్టి భగవత్ స్వరూపములు అన్నీ సమానములే.
ఎన్ని దీపములు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపములుగా ఉన్నది ఒక్కటే అని తెలుసుకోవాలనే జ్యోతిర్లింగం ఆవిర్భవించింది.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
💥మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో బ్రహ్మాదులు స్తుతించిన మహాలింగస్తుతి 💥🙏
అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభరూపిణే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ప్రధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
నిర్వికారాయ నిత్యాయ సత్యాయామలతేజసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
వేదాంతసార రూపాయ కాలరూపాయ ధీమతే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment