🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌺🌹అరుణాచల శివ అరుణాచల శివ 🌹🌺 ⚜️🚩ఒకసారి భగవాన్ రమణ మహర్షుల వారు భౌతికంగా జీవించి ఉన్నకాలంలో ఆశ్రమంలో ఒక ఉత్సవం జరిగింది. భోజనవేళ కాగానే నిర్వాహకులు "ప్రముఖులందరికీ ముందుగా వడ్డన జరుగుతుంది. బైరాగులు, బికారులు బయట కూర్చోండి; తరువాత పంక్తిలో పిలుస్తాం" అంటూ రమణుల కోసం వెతికారు. కానీ మహర్షి ఎక్కడా కనిపించలేదు. బయట ఎక్కడో బైరాగుల మధ్య కూర్చున్నారు. "ఇదేంటి మహాత్మా! మీ కోసం న్యాయమూర్తులు, పురప్రముఖులు వేచి చూస్తున్నారు" అన్నారు నిర్వాహకులు. "బైరాగులు, బికారులు తరువాత పంక్తిలో అన్నారుగా, అందుకే తరువాత పిలుస్తారనుకొని బయటకు వచ్చాను" అన్నారు భగవాన్ రమణులు. 🌹భోగాలను త్యజించి, కౌపీనం ధరించినంత మాత్రాన వారి విలువ ఏమైనా తరిగిపోయిందా. అందుకే ఎందులో వెళుతున్నామా? అన్నది కాదు ప్రధానం; అంతరంగంలో ఎంత అకళంకంగా, ఆనందంగా ఉన్నామన్నదే ప్రమాణం. ⚜️🚩సుఖాలకూ, సౌకర్యాలకూ అలవాటు పడకుండా వాటితో అంటీముట్టనట్టుగా వ్యవహరించాలి. ఆవగింజంత నిరాశ కూడా ఎదురు కాకూడదంటే అసలు భోగాలకే దూరంగా ఉండాలి. 🌹భోగాలతో కాలం గడుపుతున్నంత కాలం భగవంతుడు మన వైపు చూడడు. ఎవరి...