🌹 🌼ఓం నమో నారాయణాయ🌼భక్త అంబరీషుని కథ
🕉️⚜️🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹
🌼ఓం నమో నారాయణాయ🌼
⚜️🚩🌹 భాగవతం
🌹 భక్త అంబరీషుని కథ 🌹🙏
🌹పూర్వం నాభాగుడు అనే ఒక చక్రవర్తికి అంబరీషుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు.
ఆ అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు.
ఎప్పుడూ హరినామ స్మరణ చేసేవాడు.
హరి కథలు వింటూ ఉండేవాడు.
ఎంతో వినయంతో ఉండేవాడు.
రాజ్యం మీద కానీ, సిరిసంపదల మీద కానీ వ్యామోహం లేని వాడు.
కేవలం కర్తవ్యం కోసం మాత్రమే రాజ్యపాలన
చేసేవాడు.
🌹ఒకరోజు అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో,
వశిష్ఠుడు మొదలైన మునుల సమక్షంలో
అశ్వమేధ యాగం చేశాడు.
అందరికీ తాంబూలాలు ఇచ్చి సత్కరించాడు.
అప్పుడు అంబరీషుడు ఒక సంవత్సరం పాటు ఏకాదశీ వ్రతాన్ని చేయాలనుకున్నాడు.
ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, ద్వాదశి రోజు పారణ చేయాలి.
అంటే ద్వాదశి గడియలు అయిపోయే లోగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి.
🌹అంబరీషుడు సంవత్సరం పాటు ఏకాదశీ వ్రతాన్ని పూర్తి చేశాడు.
తర్వాత కాళింది నదిలో స్నానం చేసి, మధువనంలో శ్రీ కృష్ణ పరమాత్మకు అభిషేకం చేశాడు.
అక్కడకు వచ్చిన బ్రాహ్మణులకు, అతిథులకు
భోజనం పెట్టి వారు తిన్న తరువాత,
ద్వాదశి గడియలు పూర్తయ్యే లోగా తాను తిని వ్రతాన్ని పూర్తి చేయాలనుకున్నాడు.
🌹అలా వచ్చిన వారందరి భోజనం పూర్తి
అయ్యి,
తాను భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో
అక్కడకు దూర్వాస మహర్షి వచ్చారు.
🌹అంబరీషుడు సంతోషంతో ఆయనను గౌరవించి, ఆయనను భోజనానికి రమ్మని పిలిచాడు.
ఆయన స్నానం చేసి తింటానని చెప్పి స్నానానికి వెళ్ళారు.
అలా స్నానం కోసం నదిలో దిగి, ఈశ్వర ధ్యానంలో పడి, భోజనం సంగతి మరచిపోయాడు.
🌹అక్కడ అంబరీషుడు ఏడాది పాటు వ్రతం
చేశాడు కాబట్టి ద్వాదశి గడియలు వెళ్ళేలోగా పారణ చేయకపోతే వ్రతం పూర్తి అవ్వదు.
అతిథి అయిన దుర్వాస మహర్షి తినకుండా అంబరీషుడు తినకూడదు.
అప్పుడు అక్కడ ఉన్న విద్వాంసుల సలహా మేరకు కొద్దిగా నీళ్ళు త్రాగాడు.
🌹కాసేపటి తరువాత దూర్వస మహర్షి ధ్యానంలో నుండి బయటకు వచ్చాడు.
అప్పుడు ఆయనకు ఆకలి గుర్తుకు వచ్చి అంబరీషుని దగ్గరకు వచ్చాడు.
🌹అత్యంత ఆకలితో ఉన్న ఆయన అంబరీషుడు నీళ్ళు త్రాగిన విషయం తెలిసింది.
అప్పుడు అతిథిని పిలిచి అవమానం చేస్తావా అని కోపంతో తన జటను నేలకేసి కొట్టి #కృత్య అనే ఒక శక్తిని సృష్టించాడు.
ఆ కృత్య భయంకరమైన శూలం పట్టుకుని అంబరీషుని మీదకు వచ్చింది.
అక్కడి వారంతా భయపడిపోయారు.
కానీ అంబరీషుడు మాత్రం నవ్వుతూ, #శ్రీమన్నారాయణ ధ్యానం చేశాడు.
🌹అప్పుడు శ్రీహరి యొక్క సుదర్శన చక్రం వచ్చి కృత్యను కాల్చేసింది.
తరువాత దూర్వాసుని మీదకు వెళ్ళింది.
భయంతో అంత శక్తి కలిగిన దూర్వాసుడు పారిపోతూ,
🌹బ్రహ్మ లోకానికి వెళ్లి, బ్రహ్మను కాపాడమని ప్రార్థించాడు.
అప్పుడు బ్రహ్మ సుదర్శన చక్రాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు, నేను కాపాడలేనని చెప్పాడు.
🌹తర్వాత కైలాసానికి వెళ్ళాడు.
శివున్ని ప్రార్థిస్తే, ఆయన కూడా సుదర్శన చక్రాన్ని నేను ఆపలేనని చెప్పాడు.
🌹అప్పుడు వైకుంఠానికి వెళ్లి, శ్రీహరి కాళ్ళ మీద పడ్డాడు.
అప్పుడు శ్రీహరి "నీవు నా పరమ భక్తుడైన అంబరీషుని పట్ల తప్పుచేశావు.
నేను నా భక్తులను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాను.
నేను నా భక్తులను బాధ పెట్టే వారిని క్షమించలేను.
నీవు అంబరీషుని కాళ్ళ మీదే పడు" అని అన్నాడు.
🌹దూర్వాసుడు వెంటనే పరిగెత్తుకుంటూ అంబరీషుని దగ్గరకు వచ్చి రక్షించమని ప్రార్థించాడు.
ఆ అంబరీషుడు భోజనం చేయకుండా ఈయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
వెంటనే అంబరీషుడు శ్రీహరిని ప్రార్థిస్తే, అప్పుడు సుదర్శన చక్రం తిరిగి వెళ్ళిపోయింది.
🌹అప్పుడు దుర్వాస మహర్షి అంబరీషునికి నమస్కారం చేశాడు.
అంబరీషుడు దుర్వాస మహర్షికి భోజనం పెట్టి ఆయన తిన్న తర్వాత అంబరీషుడు తిన్నాడు.
🌹అవతల వారు ఎంతటి వారైనా, ఎటువంటి సమస్యలైనా శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు.
🌹"అంబరీషుని చరిత్ర వినిన వారికి, చదివిన వారికి ధైర్యం, సంపదలు కలిగి పుణ్యులు అగుదురు గాక" అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలిపాడు.
🌹 గోవింద గోవింద గోవింద 🌹
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment