ఓం నమః శివాయ 🌹🙏 వీణాధారి రావణుడు... 🌺 ఆర్తి హర స్తోత్రమ్🌺

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏


⚜️🚩కైలాస పర్వత మహాత్యాన్ని గురించి విన్న రావణునికి కూడ ఒక్కసారైనా కైలాసపర్వతాన్ని దర్శించుకోవాలి అనిపించింది.

అనుకున్నదే తడవుగా కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు.

అక్కడకు చేరుకున్నదే ఆలస్యమన్నట్లు శివపరమాత్మను గురించి తపస్సును ప్రారంభించాడు.


🌹శివుని అనుగ్రహాన్ని పొంది అత్యంత బలశాలిగా మారిన రావణుని మనసులో గబుక్కున ఓ విధమైన పేరాశ మొలకెత్తింది.

శివదేవుడు కొలువైన కైలాస పర్వతాన్ని అలాగే తన రాజ్యం లంకకు తీసుకెళ్ళాలనేది అతడి ఆశ.

అతడు తన ప్రయత్నాలను మమ్మారం చేయసాగాడు.


🌹ఆ పర్వతాన్ని కూకటివేళ్ళతో లేపాలని ప్రయత్నిస్తోన్న అతని భీకర ప్రయత్నాలవల్ల కైలాసపర్వతమే అటు ఇటు కదలాడసాగింది.

కైలాస పర్వతం అకస్మాత్తుగా అటు ఇటు ఊగుతుండటాన్ని చూసిన పార్వతీదేవి, ప్రక్కనున్న శివదేవునితో,

కైలాసపర్వతం ఎందుకు ఇలా ఊగుతోందని ఆందోళనతో ప్రశ్నించింది.

అప్పుడాయన తన కాలి చిటికిన వేలుతో కైలాస పర్వతాన్ని చిన్నగా ఓ నొక్కు నోక్కాడట.

అంతే, ఆ మరుక్షణం రావణుని ఆహాంభావమంతా తుత్తునియలైపోయింది.

పరమేశ్వరుని కాలి చిటికిన వేలు ఒత్తిడికి భూమి గట్టిగా అతుక్కుపోయిన కైలాస పర్వతం కింద

రావణుని పది తలలలో ఒక తల,

చేతులలో ఒక చేయి ఇరుక్కుపోయాయి.

అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ

తన తలను, చేయిని విడిపించుకోలేకపోయాడు.

ఏం చేయాలో తెలియని రావణాసురుడు మిగతా తొమ్మిది తలలలో ఒక తలను తెగనరికి,

చేతులలో ఒక చేయిని కూడ ఖండించి

ఒక వీణను తయారు చేసాడు.

తన నరాలనే ఆ వీణకు తంత్రులుగా ఏర్పాటుచేసిన రావణాసురుడు

కాంభోజిరాగంలో స్వామిని వేడుకుంటూ భక్తి గీతాలాపన చేసాడు.

అతని భక్తిని మెచ్చి పరమశివుడు,

అతనికి యథారూపాన్ని వరాలతో అనుగ్రహించాడు.

అనంతరం రావణాసురుడు అపర శివభక్తునిగా పేరుగాంచాడు.


🌹ఈ వృత్తాంతాన్ని అనుసరించి కొన్ని శివాలయాలలో జరిగే ఉత్సవ విగ్రహాలలో

#వీణాధారి రావణాసురుని శివవాహనాల్లో

ఒకనిగా మలచి ఊరేగింపును నిర్వహిస్తుంటారు. 


🌹కైలాసపర్వతాన్ని పెకలించేందుకు ప్రయత్నించిన రావణాసురుడు విగ్రహాన్ని రూపొందించి,

ఆ రక్కసుడు కైలాసపర్వతాన్ని మోస్తున్నట్లుగా,

ఆ పర్వతంపై ప్రమథగణాలతో పాటు పార్వతీపరమేశ్వరులు కొలువై ఉన్నట్లుగా

అమర్చి ఊరేగిస్తుంటారు.


ప్రణమ్య శిరసాదేవం స్వయంభుం పరమేశ్వరమ్

ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుమ్!

                       🔱🌺🔱🌺🔱🌺🔱


🌺🌺🌺 ఆర్తి హర స్తోత్రమ్🌺🌺🌺


శ్రీ శంభో మయి కరుణా శిశిరాం దృష్టిం దిశన్ సుధావృష్టిమ్ |

సంతాపమపాకురు మే మంతా పరమేశ తవ దయాయాః స్యామ్ || 


అవసీదామి యదార్తిభిరనుగుణమిదమోకసోఽంహసాం ఖలు మే |

తవ సన్నవసీదామి యదంతకశాసన నతత్తవానుగుణమ్ || 


దేవ స్మరంతి తవ యే తేషాం స్మరతోఽపి నార్తిరితికీర్తిమ్ |

కలయసి శివ పాహీతిక్రందన్ సీదామ్యహం

కిముచితమిదమ్ || 


ఆదిశ్యాఘకృతౌ మామంతర్యామిన్నసావఘాత్మేతి |

ఆర్తిషుమజ్జయసే మాం కిం బ్రూయాం తవ కృపైకపాత్రమహమ్ ||


మందాగ్రణీరహం తవ మయి కరుణాం ఘటయితుం విభో నాలమ్ |

ఆక్రష్టుం తాంతు బలాదలమిహ మద్దైన్యమితి

సమాశ్వసిమి || 


త్వం సర్వజ్ఞోఽహం పునరజ్ఞోఽనీశోఽహమీశ్వరస్త్వమసి |

త్వం మయి దోషాన్ గణయసి కిం కథయే తుదతి కిం దయా న త్వామ్ || 


ఆశ్రితమార్తతరం మాముపేక్షసే కిమితి శివ న కిం దయసే |

శ్రితగోప్తా దీనార్తిహృదితి ఖలు శంసంతి జగతి సంతస్త్వామ్ || 


ప్రహరాహరేతివాదీ ఫణితమదాఖ్య ఇతి పాలితో భవతా |

శివ పాహీతి వదోఽహం శ్రితో న కిం త్వాం కథం న పాల్యస్తే || 


శరణం వ్రజ శివమార్తీః స తవ హరేదితి సతాం గిరాఽహమ్ త్వామ్ |

శరణం గతోఽస్మి పాలయ ఖలమపి తేష్వీశ పక్షపాతాన్మామ్ || 


ఇతి శ్రీశ్రీధరవేంకటేశార్యకృతం ఆర్తిహరస్తోత్రమ్ |

                             🌺🕉️🌺🕉️🌺



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు