"రామ" శబ్దము🌹🙏

 🕉️⚜️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏


⚜️🚩"రామ" శబ్దము🌹🙏


🌹బ్రహ్మదేవుడు "నారాయణ" శబ్దం లోని రెండవ అక్షరమైన 'రా' ను

"నమఃశివాయ" శబ్దములోని రెండవ అక్షరమైన 'మ' ను తీసుకొని

"రామ" అను శబ్దమును సృష్టించి, సరస్వతీదేవికి చెప్పాడు.


🌹ఈ రామ నామము మహా మహిమాన్వితమైనదనీ, 

రామ నామం ఉఛ్ఛరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందనీ,

ముక్తి దాయకమని చెప్పాడు.


🌹ప్రక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు.

జాగ్రత్తగా విన్నాడు.

బ్రహ్మ లోకం నుండి భూలోకం వచ్చాడు.

ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు.


🌹ఒక బోయవాడు తటస్థపడ్డాడు.

అతని చరిత్రంతా దివ్య దృష్టితో క్షణంలో గ్రహించాడు.

అతడు హింసాయుత కర్మాచరణలో ఉన్నాడు.

అపమార్గంలో నడుస్తున్నాడు.


🌹అతడిని ఈ మార్గంనుంచి తప్పించి ఉన్నత మార్గానికి చేర్చాలి అనుకొన్నాడు.

"రామ" అను శబ్దమును ఉపదేశించాడు.

పట్టుదలతో జపించమన్నాడు.


🌹బోయవాడు శ్రద్దతో విన్నాడు.

అదేపనిగా మనసులో స్మరిచుకుంటూ, కొంతసేపు, మరి కొంతసేపు ఉచ్చరిస్తూ

అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు.


🌹రోజులు గడుస్తున్నాయి.

తన పట్టుదలను వదలలేదు.

ధృఢచిత్తంతో అలానే ఉన్నాడు.

చుట్టూ పుట్ట వెలసింది. చిక్కిశల్యమయ్యాడు. 


🌹 పుట్టకొనలనుండి, దివ్యకాంతులు ప్రసరిల్లుతున్నాయి.

రామ నామము వినపడుచున్నది.

సంవత్సరాలు గడిచాయి.

పుట్టకొనలనుండి వస్తున్న "రామ" నామము బ్రహ్మలోకము చేరుకొన్నది.


🌹బ్రహ్మ సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు.

పుట్టపై తన కృపా రస దృష్టిని ప్రసరింపచేశాడు.

పుట్టలోనుండి బంగారు వన్నెచాయతో గల మేనితో,

తెల్లని గడ్డముతో, జడలతో ఒక చేతిలో కమండలము,

మరొక చేతిలో దండముతో, ఙ్ఞానజ్యోతి రూపు దాల్చాడా అన్నట్లు

ఒక మహర్షి లేచి వచ్చి బ్రహ్మదేవునకు నమస్కరించాడు.


🌹"నీవు వల్మీకము (పుట్ట)నుంచి లేచి వచ్చావు.

కనుక ఇక నుండి "వాల్మీకి" అను పేరుతో పిలువబడతావు.

నీవలన ఒక మహత్కార్యము నెరవేరుతుంది.

అది రామాయణ కావ్య రచన.


🌹ఈ కావ్య రచన వలన లోకములో రామ నామము వ్యాప్తి చెందుతుంది.

సర్వ మానవాళికి రామ నామము సధ్గతిని కలిగిస్తుంది.

కనుక రామాయణము రచింపుమని ఆదేశించాడు. 


🌹వాల్మీకి మహర్షి రామాయణమును రచించాడు.

అందులో గాయత్రీ మంత్రమును నిక్షిప్తంచేశాడు.


🌹విష్ణు సహస్ర నామాలు పఠిస్తే దుస్వప్నములు రావు.

అశుభములు కలుగవు.

ధర్మార్ధ కామ మోక్షాలు కలుగుతాయి.

అనారోగ్యములు కలుగవు.

బంధనముల నుండి విముక్తులవుతారు.

ఆపదలు సంభవించవు.

ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

ఇన్ని ప్రయోజనాలు సులభంగా పొందడానికి ఏదేని ఉపాయం ఉన్నదా? అని పార్వతీ దేవి శివుడిని అడిగినది.

శివుడు సులభంగా పొందడానికి ఉపాయం ఉన్నది, అది-


శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే


సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.


🌹రామ అనే శబ్ధం ఒకసారి పఠిస్తే "విష్ణు సహస్ర నామాలు" ఒకసారి పఠించిన దానితో సమానము-

కనుక రామ నామము అంత విశిష్టమైనది,

అన్ని నామములలోకెల్లా శ్రేష్ఠమైనదనీ అన్నాడు.

🌹సేకరణ

                       ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏