త్రినేత్ర దశభుజ వీరాంజనేయస్వామి🌹🙏

 🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏


🌹త్రినేత్ర దశభుజ వీరాంజనేయస్వామి🌹🙏


⚜️🚩 రామరావణ యుద్ధం ముగిసింది.

తన పరివార సహితంగా శ్రీరాముడు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు.

ఈలోపు భరద్వాజ ముని ఆశ్రమం వచ్చింది.

నాడు పంచమి తిథి.

అప్పటికి పధ్నాలుగు సంవత్సరాలయ్యాయి.

రాముని అభిమతం ప్రకారం, అందరూ భరద్వాజ ఆశ్రమంలో విడిది చేశారు.


🌹నారదుడు "రామా రావణుని సంహరించినందువల్ల అంతా ముగిసిందనుకుంటున్నావు.

అందులో సగం మాత్రమే నిజం.

అసురులు ఇంకా ఇద్దరు ప్రాణంతోనే ఉన్నారు.

జరిగినదానికి ప్రతీకారేచ్ఛతో, వారు ఊగిపోతున్నారు.

రక్తబిందువు, రక్తాక్షుడనే రాక్షసులు నిన్ను గెలిచేందుకై సముద్ర అడుగు భాగంలో ఉండి తీవ్రమైన తపస్సు చేస్తున్నారు.

వారు, శక్తివంతమైన వరాలతో బయటపడ్డారంటే, ఆ రాక్షసులను అడ్డుకోవడం కష్టం.

ఫలితంగా ప్రపంచం అనేక కష్టాలకు లోనవ్వాల్సి ఉంటుంది.

అందుకే రామయ్యా నువ్వు త్వరగా ఆ ముష్కరులను అంతం చేసే దిశగా ఆలోచించు" అన్నాడు.


🌹నారదా నేను ప్రస్తుతం అయోధ్యకు తిరుగు పయనమయ్యాను.

మీకు తెలుసు కదా నేను చెప్పిన సమయంలోపు అయోధ్యకు చేరుకోకపోతే భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు.

ఏం చేయాలి?

"లక్ష్మణుని పంపవచ్చు కదా!"

"తను నా నీడవంటి వాడు మహర్షీ

నన్ను వదలి ఉండనని శపథం చేసాడు కదా

ఆ సంగతి కూడా మీకు తెలుసు కదా" అని

మాట్లాడుతున్న రాముని దృష్టి హనుమంతునిపై పడింది.


🌹"నా ప్రియమైన హనుమంతా రాక్షస సంహారం నీ చేతుల మీదుగా జరుగనివ్వు" అని ఆనతిచ్చాడు శ్రీరామచంద్రమూర్తి.

క్షణంలో ఆంజనేయునికి స్వామి ఆనతిచ్చిన విషయం ముల్లోకాలకు పాకింది.


🌹ఆంజనేయుని విజయం కోసం దేవతలంతా ఆశీర్వదించారు.

"జయమగుగాక" అని ఆశీర్వదించిన విష్ణు భగవానుడు, తన శంఖుచక్రాలను హనుమంతునికి ఇచ్చాడు.

ఆ శుభదృశ్యాన్ని చూసిన బ్రహ్మదేవుడు, తన బ్రహ్మ కపాలాన్ని అనుగ్రహించాడు.

ఇలా ఒక్కొక్క దెైవం తన శక్తియుక్తులను హనుమంతునికి అందించసాగారు.

అన్ని ఆయుధాలను స్వీకరించిన ఆంజనేయుడు పది చేతులతో, ఆ చేతులలో పది ఆయుధాలతో అద్భుతంగా గోచరించాడు.


🌹గరుడ భగవానుడు హనుమంతునికి తన రెక్కలను బహూకరించాడు.


🌹శివపరమాత్మ  తన మూడవ కన్నును ఆంజనేయునికి బహూకరించాడు.


🌹మూడుకళ్ళు, పదిచేతులతో, రెక్కలను విసురుకుంటూ హనుమ రాక్షస సంహారానికి బయలుదేరాడు.

"త్రినేత్ర దశభుజ వీరాంజనేయస్వామి" వస్తున్న శబ్దాన్ని విన్న రక్తబిందు, రక్తాక్ష రాక్షసుల గుండెలు అదిరాయి. భయంతో పరుగులు తీశారు.


🌹మూడవకన్నును తెరిచాడు.

పదిచేతుల్లోని ఆయుధాలను ప్రయోగించాడు.

రాక్షస సంహారం జరిగింది. 

                           🕉️🌺🕉️🌺🕉️🌺🕉️


అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!


రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

                           ⚜️🌹⚜️🌹⚜️🌹⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు