ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹 ⚜️🚩చేజారినది చేజిక్కిన వేళ..!!
🌹ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹
⚜️🚩చేజారినది చేజిక్కిన వేళ..!!
ఏదైనా వస్తువు మన చేజారి తిరిగి కొన్నాళ్ల తరువాత మన చేజిక్కితే ఆ సంతోషమే వేరు.
అందులోనూ గంగలో చేజారిన వైతే ఆ సంతోషమే, సంతోషం.
హరి బావు కేశవ్ అనే అతను హరిభావు కే. కార్నిక్ అనే అతని మనుమడు.
ఇరువురు సాయి భక్తులు.
సాయి యందు పూర్తి విశ్వాసం గలవారు.
ఒక పర్యాయము వారి గ్రామమునకు 10 మైళ్ళ దూరంలో గల ఒక నది ఒడ్డున గల దేవాలయములో సంబరములు జరుగుచుండగా కేశవ్ అక్కడకి వెళ్ళను.
ప్రతి నిత్యము నదిలో స్నానం చేయడం ఈతకొట్టుటయే గాక దైవ దర్శనం కూడ చేసుకొనేవాడు.
అతను తిరుగు ప్రయాణమయ్యే రోజు కూడా నదిలో ఈత కొట్టుచుండగా అతని చేతి వ్రేలికి ఉన్న ఉంగరము నదిలో జారిపోయెను.
నదిలో పడిపోయినది దొరకుట కల్ల అని మనకందరకు తెలుసు.
ఆపరిస్థితుల్లో కూడా తాత మనవడు ఇద్దరు కూడా బాబా పై భారము వేసి బాబాను వేడుకొనిరి.
సుమారు ఆరు మాసాల తర్వాత ఒక రోజు ఒక ఫకీరు వేషధారి కేశవ్ ఇంటికి వచ్చి
"మీ ఇంటిలో వారిది ఎవరిదైన ఉంగరం నదిలో పడిపోయింది?" అని ప్రశ్నించగా
కేశవ్ తనదే పడిపోయినదని చెప్పుటయే గాక దాని గుర్తులు కూడా చెప్పుటచే ఆ ఫకీరు ఆ ఉంగరం కేశవ్ కు ఇచ్చెను.
ఇక్కడ మనం గమనించి వలసినవి:
నదిలో పడిపోయిన ఉంగరం ఆ ఫకీరుకు ఎలా లభించినది అది కూడ ఆరుమాసాల తరువాత,
ఆ ఉంగరం కేశవ్ దేనని అతనికి ఎలా తెలుసు? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నల గానే మిగిలిపోతాయి. వచ్చినది త్రికాలజ్ఞుడు, మరియు త్రిలోకాలు సంబంధించిన సాయి బాబాయే అని మనం గ్రహిస్తే పై ప్రశ్నలు ఉత్పన్నమే కావు.
🌹సేకరణ
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

Comments
Post a Comment