భక్తుడు బాధలో ఉంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు గదా! ఆ ఆపదల నుండి రక్షించుటయే భగవంతుని కర్తవ్యం

 

🌹ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹

🌹ఆపదలో ఆదుకునేవాడే భగవంతుడు
భక్తుడు బాధలో ఉంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు గదా!
ఆ ఆపదల నుండి రక్షించుటయే భగవంతుని కర్తవ్యం.

🌹భక్త నరసీ మెహతా🌹
బంగారాన్ని పుటం వేస్తే కానీ మెరవదు.
అలాగే బాధలను అనుభవిస్తే గాని భక్తునికి భగవద్దర్శనం కాదు.
నరసీ మెహతా తల్లిదండ్రులు అతని చిన్నతనముననే కాలము చేసిరి.
అతని అన్నలే నరసీ మెహతాను పెంచిరి. నరసీ కుటుంబ బాధ్యతలను పట్టించుకొనక అల్లరి చిల్లరిగా తిరిగేడివాడు.
అది చూచి అతని వదినలు వారి భర్తలతో చెప్పి నరసీ మెహతా కుటుంబాన్ని బయటకు గెంటివేసిరి.

నరసీ మెహతాకు వివాహమై ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె జన్మించిరి.
కుమార్తె పేరు కువరీబాయి,
నరసీ మాత్రము ఎల్లవేళలా భగవన్నామ సంకీర్తన చేయుచు కాలం గడిపెడివాడు.
అతని కుమార్తెకు 7సంవత్సర ప్రాయములోనే వివాహము చేసి అత్త వారంటికి పంపిరి.
కొన్ని సంవత్సరముల తర్వాత ఆమె పుష్పవతి అయ్యేను.

అటువంటి సమయంలో పిల్ల తల్లిదండ్రులు సారె తీసుకువెళ్లి వియ్యంకులకు సమర్పించి వేడుక జరిపించవలెను.
అదే విషయం నరసీ భార్య, నరసీతో చెప్పగా అతడు నాకున్నది భగవన్నామ సంకీర్తనం.
అదియే కుమార్తెకు కానుకగా ఇచ్చెదను అని చెప్పి ఒక చేతితో తాళములు రెండవచేతితో తంబురను, పట్టుకొని భగవన్నామ సంకీర్తన చేయుచు వియ్యంకుల వారి ఇంటికి వెళ్లి
“మీకు ఏమి సారే కావలెనో ఒక చీటి వ్రాసి ఇవ్వండి భగవంతుని కృపాకటాక్షములచే వాటినన్నింటినీ మీకు సమర్పించెదను" అని చెప్పగా,

వియ్యంకులవారి ఇంటినుండి వారందరు వారి వారికి కావలసిన వస్తువులను అన్నిటిని ఒక లేఖకునిచే వ్రాయించగా
ఆ లేఖకుడు తనకు ఒక గుండు రాయి కావలెనని రాసాను.
ఆ పత్రమును తీసుకుని మెహతా సరాసరి పాండురంగ ఆలయం లోనికి వెళ్ళి తన ఆవేదనను రంగనికి విన్నవించుకొనెను.

ఆ విధముగా తన అసమర్ధతకు చింతిస్తూ సోమ్మసిల్లి పడిపోయెను.
భక్తుని బాధలు భగవంతునివే గదా!
వెంటనే పాండురంగడు ఒక నౌకరు వేషధారియై ఆ చీటీలో ఉన్న వస్తువులన్నిటిని కొని ఒక బండిలో వేసుకొని నరసీ వియ్యంకులు గృహమున కేగి నేను నరసీ మెహతా నౌకరును మీరు కోరిన వస్తువులన్నిటిని నా యజమాని పంపినాడు.
మీరు అన్ని వచ్చినవో లేదో సరి చూసుకోండి అని చెప్పి అక్కడ ఆ ఇంటి అరుగుపై కూర్చుండెను.

వారి వ్రాసినవన్ని గుండు రాయితో సహా ఉండుటచే సంతృప్తిచెంది
ఓయీ! నీ యజమాని ఎక్కడ? అని ప్రశించగా అతను పాండురంగని ఆలయంలో ఉన్నాడు అని చెప్పగా
అందరు ఆలయానికి వెళ్లి చూడగా నరసీ మూర్చిపడి ఉండుట గాంచి అతనికి ఉపచారములు చేయగా నరసీ మూర్చ నుండి తేరుకొని
బావగారు! నన్ను క్షమించండి. నాకు కొంత గడువు ఇవ్వండి. మీరు కోరినవన్నీ సమర్పించుకుంటాను అనగా అది విన్న వారందరు విస్తుపోయిరి.

జరిగినదంతా నరసీకి చెప్పగా నరసీ అదంతయు రంగని మహిమ
తనకోసం పాండురంగడు నౌకరు వేషధారియై తన వియ్యంకుల కోర్కెను తీర్చెనని గ్రహించి అతని హృదయాంతరాళములు భక్తితో పొంగి పొర్లినది.

🌹సేకరణ
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం