🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏శ్రీరంగ గద్యము🌹🙏

 🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


⚜️🚩అంత వరకు రహస్యముగా ఉన్న నారాయణ మంత్రమును (ఓం నమో నారాయణాయ) గురువులు, పెద్దలను ఎదిరించి శ్రీ రంగములోని మందిరం ఎక్కి ఎలుగెత్తి చాటారు శ్రీ రామానుజాచార్యులు.


🌹భగవంతుని చేరటానికి సాధనమైన మంత్రాన్ని అందరికీ చెప్పటం వలన పాపం కలిగితే,

ఆ పాపము, దాని ఫలితము అనుభవించటానికి నేను సిద్ధము అని తన ఔన్నత్యాన్ని చాటారు.


🌹ఆయన రచించిన అద్భుతమైన నుతి...

ఆర్తితో, సర్వస్య శరణాగతితో, భక్తి నివేదనతో చేసిన రచన "శ్రీరంగ గద్యము"


🌹శ్రీరంగ గద్యము🌹🙏


స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి

ప్రవృత్తిభేదం క్లేశ కర్మాద్యశేష దోషా సంస్పృష్టం!


స్వాభావికానవధికాతిశయ జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతాద్యసంఖ్యేయ కల్యాణ గుణగణౌఘ మహార్ణవం!


పరబ్రహ్మ భూతం! పురుషోత్తమం! శ్రీరంగ శాయినం! అస్మద్స్వామినం! ప్రబుద్ధ నిత్య నియామ్య నిత్యదాస్యైకరసాత్మ స్వభావోహం! తదేకానుభవః! తదేకప్రియః! పరిపూర్ణం భగవంతం విశదతమ అనుభవేన నిరంతరమనుభూయ! తదనుభవజనిత అనవధికాతిశయ ప్రీతికారిత అశేషావస్థోచిత అశేష శేషతైకరతిరూప నిత్య కింకరో భవాని!


స్వాత్మ నిత్య నియామ్య నిత్యదాస్యైకరసాత్మ స్వభావాను సంధానపూర్వక భగవదనవధికాతిశయ స్వామ్యాద్యఖిల గుణగణానుభవజనిత అనవధికాతిశయ ప్రీదికారిత అశేషావస్థోచిత అశేష శేషైతైకరతిరూప నిత్య కైంకర్య ప్రాప్త్యుపాయ భూతభక్తితదుపాయ సమ్యగ్ జ్ఞాన తదుపాయ సమీచీనక్రియాతదనుగుణ సాత్వికత్ ఆస్తిక్యాది సమస్త ఆత్మ గుణ విహీనః! దురుత్తరానంత తద్విపర్యయ జ్ఞానక్రియానుగుణ అనాది పాప వాసనా మహార్ణవాంతర్నిమగ్నః! తిలతైలవత్! దారువన్హివత్! దుర్వివేచ త్రిగుణ క్షణక్షరణస్వభావ అచేతన ప్రకృతి వ్యాప్తిరూప దురత్యయ భగవన్ మాయాతిరోహిత స్వప్రకాశః! అనాద్య విద్యా సంచితానంతాశక్య విస్రంసన కర్మపాశ ప్రగ్రథితః! అనాగతానంతకాల సమీక్షయాఽఅపి అదృష్ట సంతారోపాయః! నిఖిల జంతు జాత శరణ్య!! శ్రీమన్నారాయణ!! తవ చరణారవిందయుగళం చరణమహం ప్రపద్యే!


ఏవమవస్థితస్యాప్యర్థిత్వమాత్రేణ! పరమకారుణికో భగవాన్! స్వానుభవ ప్రీత్యోపనీతైకాంతికాత్యంతిక నిత్యకైంకర్యరతిరూప నిత్య దాస్యం దాస్యతీతి విశ్వాసపూర్వకం భగవంతం నిత్య కింకరతాం ప్రార్థయే!


తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం!

దేహి మే కృపయా నాథ! న జానే గతిమన్యథా!!


సర్వావస్థోచితాశేషశేషతైకరతిస్తవ!

భవేయం పుందరీకాక్ష! త్వమేవైవం కురుష్వ మాం!!


ఏవంభూత తత్వాథాత్మ్యావబోదతదిచ్ఛారహితస్యాపి!

ఏతదుచ్చారణ మాత్రావలంబనేన!

ఉచ్యమానార్థ పరమార్థ నిష్టమ్ మే మనః త్వమేవ అద్యైవ కారయ!


అపార కరుణాంబుధే! అనాలోచిత విశేష అశేష లోక శరణ్య! ప్రణతార్తి హర! ఆశ్రిత వాత్సల్యైక మహో దధే! అనవరత విదిత నిఖిల భూత జాత యాథాత్మ్య! సత్యకామ! సత్య సంకల్ప! ఆపత్సఖ! కాకుత్స్థ!శ్రీమన్!

నారాయణ! పురుషోత్తమ! శ్రీరంగ నాథ! మమ నాథ!నమోస్తు తే! 


ఇతి శ్రీరంగగద్యం సంపూర్ణం ||

                        ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు