సాయిబాబా ప్రబోధించిన అసామాన్య గుణాలు ఏమిటి ఓం శ్రీ సాయి రామ్
🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹
⚜️🚩సాయిబాబా ప్రబోధించిన అసామాన్య గుణాలు ఏమిటి?
సర్వసాధారణంగా మనందరికీ ఇతరుల గురించి కుతూహలం ఉంటుంది.
తోటివాళ్ళేం చేస్తున్నారు,
ఎంత సంపాదిస్తున్నారు,
ఎలా జీవిస్తున్నారు లాంటి అనేక అనవసర
విషయాల మీద దృష్టి పెడతాం.
ఆ అంశాల్లో ఉన్న కుతూహలం నిజంగా అవసరమైన
విషయాల్లో ఉండదు.
ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలనుకోం.
ఆధ్యాత్మికంగా ఎదిగి ఔన్నత్యం సంపాదించాలనుకోం. సాయిబాబా ఇతర్ల విషయాలు తెలుసుకోవాలనే ఈ రకమైన వైఖరిని పూర్తిగా ఖండించాడు.
ఎవరికి వారు, ''నేను ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? ఏం చేస్తే జీవితం
సార్ధకమౌతుంది? - అని ఆలోచించి,
ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ,
ఆదర్శప్రాయంగా జీవించాలని
షిర్డీ సాయిబాబా సామాన్యునిలా జీవించి, అసామాన్య గుణాలను ప్రబోధించాడు.
🌹 సేకరణ
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

Comments
Post a Comment