భక్తి కోసం భగవంతుడు ఎంతటి శ్రమకైనా వెనుకాడడు ఓం సాయి శ్రీసాయి

 🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹

⚜️🚩భక్తి కోసం భగవంతుడు ఎంతటి శ్రమకైనా వెనుకాడడు.

🌹నానాసాహెబ్ చందోర్కర్🌹

అది నానాసాహెబ్ జామ్మేరులో పని చేయుచున్న రోజులు.

అతని కుమార్తె మైనతాయి గర్భిణి కాగా ప్రసవ దినములు దగ్గరపడెను.

ఆమె ఆరోగ్యపరిస్థితి బాగుండ లేదు.

ప్రసవవేదన పడసాగెను. అటువంటి సమయంలో ఊది బాగా పని చేస్తుందని వారికి తెలుసు.


కానీ ఆ సమయానికి ఇంటిలో ఊది నిండుకున్నది. ఏమీ చేయుటకు వారికీ దిక్కు తోచలేదు. నానాసాహెబ్ వెంటనే పూజా గదిలోనికి వెళ్ళి బాబా! నీట ముంచిన, పాల ముంచినా భారము నీదే. నాకుమార్తెకు సుఖ ప్రసవము కావించి ఆమెను ఆరోగ్యవంతురాలిని చేయుట నీదే బాధ్యత అని భారమంతయు బాబాపై వేసెను.


ఆ సమయానికి షిరిడీలో రామ్ గీర్ బువా ఉన్నాడు. అతనిని బాబా 'బాపూగీర్ బువా' అని పిలిచెడి వాడు.

అతను తన స్వగ్రామమైన ఖాందేషు వేళ్ళుటకు అనుమతిని వేడగా బాబా అతనికి కొంత ఊదిని మరియు ఆరతి పాటను ఇచ్చి

వీటిని జామ్నేరులో ఉన్న నానాసాహెబ్ కు ఇవ్వు

అని ఆజ్ఞాపించెను.

రామ్ గీర్ బువా ఆలోచనలోపడెను.


అతని వద్ద ఉన్న డబ్బులు జలగామ్ వరకు వెళ్ళుటకు మాత్రమే ఉన్నది.

అక్కడ నుండి జామ్నేరు కనీసం 30 మైళ్ళు ఉంటుంది. ఎట్లా వెళ్ళాలా అని ఆలోచించి వెళ్ళమన్నది బాబా నా భారమంతా బాబాదే.

నన్ను అక్కడకు చేర్చే బాధ్యత బాబాదే అని మనస్సులోనే నిశ్చయించుకొని అతని వద్ద నున్న డబ్బులతో రైలు ఎక్కి జలగామ్ చేరెను.


అక్కడ నుండి జామ్నేరు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుండగా ఒకతను షిరిడీనుండి వచ్చిన బాపూగీర్ బువా ఎవరు?" అని ప్రశ్నించగా

బాపూగీర్ అతని చెంతకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకొనగా

అతను తనను నానాసాహెబ్ పంపెనని చెప్పి గుఱ్ఱపుబండిలో కూర్చుండ బెట్టి దారిలో ఆహారం పెట్టి జామ్నేరు చేరి నానాసాహెబ్ గృహమునకు తీసికొనిపోయెను.


బాపూగీర్ గృహములోనికి పోయి నానాసాహెబ్ తో తాను షిరిడీ నుండి వస్తున్నట్లు చెప్పి బాబా ఇచ్చిన ఊదీ, ఆరతి పాటను ఇవ్వగా

వారు సకాలంలో ఊది వచ్చి నందుకు సంతసించి కొంత ఊదీని మైనతాయి నుదుటన పెట్టి

మరికొంత నీటిలో కలిపి ఆమెచే త్రాగించి ఆరతిని పాడగా వెంటనే మైనతాయికీ సుఖప్రసవం జరిగెను. 


ఆ వెనువెంటనే నానాసాహెబ్ బయటకు వచ్చి బాపూగీర్ బువాకు కృతజ్ఞతలు చెప్పగా అతను 

మీరు స్టేషనుకు జట్కాబండి పంపకపోతే నేను సకాలంలో ఇక్కడకు వచ్చే వాడిని కాను అని చెప్పగా సానాసాహెబ్ మీరు వస్తున్న సంగతి నాకు తెలియదు.


నేను ఏ బండి మీకోసం పంపలేదు అని చెప్పగా బాపూగీర్ అచ్చెరెవొంది

ఇరువురు బయటకు వచ్చి చూడగా అక్కడ జట్కాలేదు జట్కావాడు లేరు.

ఇదంతా బాబా లీల అని ఇరువురు గ్రహించారు. తనను బాబా ఒక్కరే బాపూగీర్ అని పిలుస్తారు అని రామగీర్ బువాకు గుర్తుకు వచ్చేను.

🌹సేకరణ

🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం