ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం శ్రీ కాళహస్తీశ్వరా🚩 ఓం నమః శివాయ 🌹🙏
🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏
🌹హర హర మహాదేవ శంభో శంకర 🌹
♦️ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!♦️
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
నీవు ఎల్లజీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా
వారికి ఆ యా జన్మలందు ప్రారబ్ధమును నిర్ణయించి దానితోపాటు వారిని జన్మింపజేయుదువు.
అట్టి ప్రారబ్ధ ఫలములోని అంశముగా నీవు నాకు సంసారబంధము అంటగట్టితివి.
అందలి అంశముగా ఆలు, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకొనినవి.
అందులకు సంబంధించిన పనులతోనే నాకు సమయము గడచుచున్నది.
మరి ఏసమయమున ఏవిధముగ నిన్ను ధ్యానించగలను?
మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసునందు దుష్టమోహమున్నది.
అందుచే కలుగు క్షుద్రచింతలను మానిపి ఎట్లు నన్ననుగ్రహింతువో!
♦️తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో
భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత
వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ
జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీ కాళహస్తీశ్వరా!♦️
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
తమ తాతలు తల్లియు తండ్రియు మరియు ఇట్టివారెందరో పెద్దలు చావగా జనులు చూచియుండరా.
చావు అనునది ప్రతిప్రాణికి తప్పక జరుగునని యిది స్వాభావికమని తెలియదా.
అట్టి చావునుండి భయపడుట ఏల!
మానవుడు యిట్టి మృత్యువునకు భయపడుచు దుఃఖముతో కాలమును గడుపుచుండునే కాని
మృత్యువును జయించి అమృతతత్వరూపమగు ముక్తి పొందుటకు సాధనమైన నీ సేవ చేయకున్నాడే.
ఇది ఎంత ఆశ్చర్యకరమగు విషయము.
⚜️🌺⚜️🌺⚜️🌺⚜️

Comments
Post a Comment