ఓం శ్రీ సాయి రామ్ 🚩బాబానే చూచుకొంటారు🌹🙏
🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹
⚜️🚩బాబానే చూచుకొంటారు🌹🙏
🌹మమల్తదారుగా పనిచేస్తున్న శంకర్రావు క్షీరసాగర్ సాయి దర్శనం కోసం శిరిడీ వచ్చాడు.
శ్రీసాయి అతణ్ణి దక్షిణ అడిగినప్పుడు,
తన దగ్గరున్న పైకమంతా తీసి సాయికి సమర్పించాడు.
🌹అతను బసకు తిరిగిరాగానే ఎవరో అడిగారు.
“మరి నీ తిరుగు ప్రయాణం ఖర్చులకు ఏం చేస్తావని”.
“బాబానే ఇస్తారులే!” అని శంకర్రావు జవాబిచ్చాడు.
🌹అదేరోజు సాయంత్రం రహతా పోస్టుమాస్టరు
తన అతిథిగా వచ్చిన ఒక మిత్రునికి తోడుగా
శిరిడీ వచ్చాడు.
కొన్నేళ్ళక్రితం ఆ అతిథిగా వచ్చిన వ్యక్తికి శంకర్రావు ఇరవై రూపాయలు చేబదులుగా యిచ్చాడట.
🌹శంకర్రావు ఏమీ అడక్కముందే ఆ వ్యక్తి తాను తీసుకొన్న పైకాన్ని శంకర్రావుకు తిరిగి చెల్లించాడు.
శంకర్రావు ఖర్చులన్నింటికీ ఆ పైకం చక్కగా సరిపోయింది.
🌹సేకరణ
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

Comments
Post a Comment