ఓం శ్రీ సాయి రామ్ బాబా యొక్క బోధనా పద్ధతి అనిర్వచనీయం.
🌹ఓo సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹
⚜️🚩అంతర్యామి మందలింపు
🌹ఒకసారి నా మిత్రుడు ఒకాయన బాబా దర్శనం కోసం శిరిడీ వచ్చాడు.
బాబా దగ్గర కూర్చొని ఆయన పాదాలు పట్టసాగాడు.
ఉన్నట్టుండి బాబా, “కాళ్ళు పట్టవద్దు! వెళిక్కడనుంచి” అని గద్దించారు.
ఆ మిత్రుడు ప్రక్కకు వెళ్ళి, కొంతసేపు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నాడు.
కొంతసేపటి తర్వాత మళ్ళీ బాబా దగ్గరకొచ్చి, ఆయన కాళ్ళుపట్టడం ప్రారంభించాడు.
బాబా ఈసారి అతణ్ణి అభ్యంతరపెట్టలేదు.
అందరము బసకు చేరుకున్న తరువాత అసలేం జరిగిందో ఆ మిత్రుడు మాకు వివరించాడు.
మొదటిసారి బాబా కాళ్ళుపడుతుండగా అతనికొక అపవిత్రమైన ఆలోచన వచ్చిందట.
ఆ ఆలోచన మనస్సు లోకి వచ్చినవెంటనే బాబా అతణ్ణి తన కాళ్ళుపట్టడం ఆపమన్నారు.
ఆ మిత్రుడు తర్వాత పశ్చాత్తాపపడి,
తనను క్షమించమని బాబాను మనస్సులో ప్రార్థించి,
తిరిగి బాబా పాదాలు పడితే బాబా అభ్యంతరం చెప్పలేదు.
భక్తులకు ఇటువంటి అనుభవాలు ప్రతిరోజూ ఎన్నో జరుగుతూనే ఉంటాయి.
బాబా యొక్క బోధనా పద్ధతి అనిర్వచనీయం.
🌹సేకరణ
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹
Comments
Post a Comment