కొల్లూరు మూకాంబికా దేవి🌹🙏
🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
🌹కొల్లూరు మూకాంబికా దేవి🌹🙏
🌹"మూకాంబిక" సరస్వతి, మహాకాళి, శక్తిల సంయుక్త స్వరూపం.
🌹శివుని వరం పొందిన #కామాసురుడు కూడకాద్రి పర్వతం మీద చేరి,
దేవతలను మునులను హింసించే వాడు.
సప్తర్షులు వీడి పీడ ఎలా విరగడ అవుతుందా అని ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ విషయాన్ని శుక్రాచార్యుడు వాడి చెవిన వేసి,
వాడి చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు.
🌹వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి
వాగ్దేవి #సరస్వతీదేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది.
🌹మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరుకోలేక పోయాడు.
అప్పటి నుంచి వాడిని ‘’మూకాసురుడు’’ అన్నారు.
🌹అప్పుడు ''కోల రుషి'' ఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి
ఒక తీవ్రశక్తిగా సృష్టించింది.
ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది.
వాడి ప్రార్ధన మన్నించి వాడికి కైవల్యం ప్రసాదించింది.
🌹మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని ''మారణ కట్టే'' అంటారు(మరణ గద్దె )
🌹మూకాసురుడు అమ్మవారిని మూకాంబికగా తన పేర వెలసిల్లమని కోరుకొన్నాడు.
వాడి కోరిక తీర్చి కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగుబంగారంగా ఉంది.
🌹ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది.
శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.
🌹"కుడజాద్రి" పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షం అయ్యారట.
ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మ స్థలమైన కేరళకు రమ్మని అడిగారట.
🌹దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచార్యుల వెంట వస్తానని కానీ
వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తే
చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట.
🌹ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట.
అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో
ఆదిశంకరాచార్యులు వెనక్కు తిరిగి చూశారట.
అలా మాట తప్పడంతో అమ్మవారు తనను అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి.
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️

Comments
Post a Comment