ఎవరు సొమ్ము వారికే🌹🙏 ఓం శ్రీ సాయి రామ్
🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹
⚜️🚩ఎవరు సొమ్ము వారికే🌹🙏
పాండురంగని అగ్రగణ్యుడు భక్తులలో ఏకనాథుడు ఒకరు.
జ్ఞానదేవ్ భగవద్గీతను మరాఠీలోకి అనువదించినట్లే ఏకనాథుడు భాగవతాన్ని మరాఠీ భాషలోకి అనువదించి నాలుగు స్కందాలు పూర్తి అయిన తరువాత
కాశీలోని పండితుల ఆమోదానికై తన శిష్యునిచే పంపగా ఆ శిష్యుడు మణికర్ణికా ఘాట్ వద్ద ఏకనాథుడు రాసిన భాగవతాన్ని పారాయణ చేస్తూంటే
అసంఖ్యాక భక్తులు వారికి మరాఠీ భాష రాక పోయినను ఆ భాషా మాధుర్యాన్ని ముగ్గులయ్యే వారు.
ఆ సంఘటనను చూసిన ఒక మహంతు శిష్యుడొకడు తన గురువుతో చెప్పగా
అతను దేవభాషలో నున్న భాగవతాన్ని ప్రాకృత భాషయైన మరాఠీలోని అనువదించిన ఏకనాధుని తన వద్దకు పిలుపించుకొన్నాడు.
కాశీలోని ప్రజలందరు ఏకనాథుడు తేజోవంతమైన ముఖవర్చసుకు అచ్చెరువొందిరి.
ఏకనాథుడు సంస్కృత భాషకు ద్రోహం చేశాడన్న నెపంతో అతనిని రాజు వద్దకు తీర్పుకు తీసుకు వెళ్ళారు.
ఆ రాజు ఒక మూర్ఖుడు.
మహంతి ఆలోచనలకు అనుగుణంగా తీర్పు నిస్తూ ఏకనాథ విరచితమైన భాగవతము గంగా నదిలో పడవేయించెను.
ఏకనాథుడు ముకిళిత హస్తుడై గంగాదేవిని ప్రార్ధించి అక్కడ ఆశీనుడయ్యెను.
అందరూ చూచుచుండగనే ఏకనాథుని భాగవతము నీటిపై తేలియాడుతూ ఏకనాధుని చెంతకు చేరును.
వెంటనే గంగామాత "ఏకనాధా! నీవు రచించిన ఈ పవిత్ర గ్రంథ రాజము నాలో మునకలు వేసి నన్ను మరింత పరమపావన మొనర్చెను.
నేడు నీవలన నాజన్మ ధన్యమైంది.
ఇదిగో నీవు వ్రాసిన భాగవతము తీసుకో,
ఇది బహుళ ప్రాచుర్యము పొందును. అసంఖ్యాకులను ఉద్ధరించును" అని భాగవతాన్ని ఏకనాధునికి సమర్పించేను.
గంగమాత ఎవరి వద్ద నుంచి ఉచితంగా ఏది గ్రహించదు.
ఏకనాథుని సొత్తుని ఏకనాథునికే సమర్పించినది.
🌹సేకరణ
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

Comments
Post a Comment