Posts

Showing posts from October, 2023

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏

Image
 🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏 పూలతో దేవతలను కొలవడం సర్వసాధారణం. కానీ పూలనే పూజించే గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగ. దేవీ నవరాత్రులలో జ్ఞానపదులు శిష్టాచారంతో అమ్మను పూజిస్తే.. జానపదులు పసుపుతో గౌరిని చేసి మొక్కే తత్త్వమే బతుకమ్మ. చేను చెలకల్లో, గుట్టల్లో పూసే గునుగు, తంగేడు, అడవి చేమంతి, కట్లపూలు, ముత్యాల పూలు, గడ్డిపూలు మొదలైన అడవి పూలకు చేసే అర్చనే.. బతుకమ్మ పండుగ. బతుకమ్మ తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పూలపండుగ. భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుక జరుపుకొంటారు.  అమావాస్య రోజున పెత్రామాస, చిన్న బతుకమ్మ, "ఎంగిలిపూల" బతుకమ్మ.. ఇలా వివిధ పేర్లతో మొదటి రోజు చిన్న బతుకమ్మ ప్రారంభమవుతుంది. తదుపరి అష్టమి రోజున "సద్దుల" బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మతో పూర్తి అవుతుంది. ఎంగిలి పూల బతుకమ్మ పితృపక్షాలలో వస్తుంది. అమావాస్య నాడు తమ పితృ దేవతలు వచ్చి, ఎంగిలిపడి వెళ్తారని, అందువల్లే ఈ పండుగను ఎంగిలి పూల బతుకమ్మ అంటారని పెద్దల మాట. 💥పండుగకు పక్షం రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకుంటారు. కైలాసపత...

💥అమ్మ స్వరూపం - ఆశ్వీయుజమాసం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అమ్మ స్వరూపం - ఆశ్వీయుజమాసం💥 అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వీయుజ మాసం అంటారు. ఆశ్వీయుజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గల కారణం “అమ్మ” గుర్తుకు రావటమే! అమ్మ అంటే మరి ఎవరో కాదు.. ఆ జగన్మాత. ముగ్గురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గాస్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే!! ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని.. ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని.. సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. "ఆశ్వీయుజమాసం"లోని శుక్ల పక్షంలో పాడ్యమి తిథిలో, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభ దినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజునుండి నవరాత్రులు ప్రారంభిస్తారు.  మొదటి మూడురోజులు #దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు #లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో #సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి. 💥దేవతలు భండ...

💥భక్తి ముక్తి💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 భక్తి ముక్తి💥 ఎవరైతే మనసా, వాచా, కర్మణా భగవంతుని యందు భక్తి కలిగి ఉంటారో, వారి యోగక్షేమాన్ని భగవంతుడే భరిస్తాడనేదానికి ఒక యదార్ధ సంఘటనను ఉదాహరణగా చెబుతాను. కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతుల వారికి ముందు పీఠాధిపతులుగా అదే పేరుతో ఇంకో స్వామి వారుండేవారు. వారు అమ్మవారికి గొప్ప ఉపాసకులు. వారితో వాదభిక్ష (వాదించాలని కోరుకోవడం) కావాలని ఒకసారి కొందరు వచ్చారు. వారిని వాదం మొదలెట్టమన్నారు స్వామి వారు.  అందుకు వారన్నారు “స్వామీ! మీ ఒళ్ళో కూర్చున్న ఆ అందమైన పాపను చూస్తుంటే మా నోట మాట రావటం లేదు. ఆ పాపను  మాకు కనిపించకుండా చేస్తే మేము మాట్లాడగలం” అన్నారు. అప్పుడు స్వామి వారన్నారు “నేనొక సన్యాసిని. నా ఒళ్ళో పాప ఆడుకోవడం ఏంటి? మీరేదో పొరబడుతున్నారు” అన్నారు. అప్పుడు వారన్నారు “కాదు స్వామీ! మీ ఒళ్ళో పాపను ప్రత్యక్షంగా మేం చూస్తున్నాం. అందువల్లే మేము మాట్లాడలేకపోతున్నాం!" అప్పుడు ఆ స్వామి వారు ” ఆ పాప మరెవరో కాదు. నేను ఉపాసిస్తున్న కామాక్షి అమ్మవారే! ఆమెకు నామీద కల దయ వలనే మీరు వాదించలేక పోతున్నారు” అన్నారు. శరణాగతి స్థితికి ...

అనందతేజో స్వరూపం దత్తాత్రేయమహం భజే

Image
 ⚜️🕉️🚩 ఓం దత్తాయ నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ అనసూయాత్రి సంభవం అఖండ జ్ఞాన వైభవం | అనందతేజో స్వరూపం దత్తాత్రేయమహం భజే || త్రిగుణ రహితం దేవం త్రిమూర్తి స్వరూపం విభుం | సద్గురుం కరుణామయం దత్తాత్రేయమహం భజే || 🍁🍁🍁🍁🍁 శ్రీ దత్తుడు గురువు, దైవమూ కూడా. అందుకే ఆయనను 'గురుదేవదత్త'గా కొలుస్తారు. స్మరించిన మాత్రమునే సంతుష్టుడై సంరక్షిస్తాడని 'స్మర్తృగామి' అని కీర్తిస్తారు. తత్త్వ జ్ఞానాభిలాషులకు "యోగి"లా, ఇతరులకు "భోగి"లా దర్శనమిచ్చే శ్రీ దత్తుడు, ఐహికాముష్మిక ఉభయ ఫలప్రదాత. జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే భక్తసులభుడు. యోగమే శ్రీ దత్తుని మార్గం. నిస్సంగత్వమే శ్రీ దత్తుని ఉపదేశం. జ్ఞానమే శ్రీదత్తుని ఉపాసన. దత్తాత్రేయస్వామి వారు పరస్పర విరుద్ధరూపాలలో తిరుగుతుంటారు. భక్తులను కఠినంగా పరీక్షిస్తుంటారు. ఒక్కోసారి జటామండలధారిగా మరుక్షణంలో ముండిత శిరస్కుడుగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతాంబరుడుగా, పీతాంబరుడిగా, కనిపిస్తారు.  ఒక్కోసారి మహా విద్వాంసుడిగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడిగా, మదమత్తుడిగా, కనిపిస్తారు. ఒకోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. ఒకోసారి మహైశ్వర్య స...

💥గురువాయూరప్పన్💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ గురువాయూరప్పనే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥గురువాయూరప్పన్💥 నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడు రూపం.. "గురువాయూరప్పన్" పవిత్రమైన విష్ణుక్షేత్రం.. దక్షిణ ద్వారకగా పిలవబడే.. కేరళ లోని "గురువాయూరు"లో.. స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు. శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి. 💥#పురాణగాధ: ఐదువేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.  పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ.. ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అం...

💥శుభకరుడు గణపతి💥

Image
 ⚜️🕉️🚩ఓం గం గణపతయే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥శుభకరుడు గణపతి💥 యోగులకు "పరబ్రహ్మ"గాను, భాగవతులకు "గాన ప్రియుడు"గాను, విద్యార్థులకు "విద్యాదాత"గాను, నర్తకులకు "నాట్యాచార్యుడు"గాను, నిస్సంతులకు "సంతాన వర దాత"గాను.. ఇట్లా ఎవరు ఏ కోరికతో కొలిస్తే వారి వారి కోరికలు ఈడేర్చే "గణనాథుడు" సర్వారాథ్యుడిగా విశ్వానికి అధీశ్వరునిగా కీర్తించబడుతున్నాడు. గణపతిని జ్యేష్ఠ రాజుగా, సర్వ దేవతలలో ప్రథమ పూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహా గణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకూ కూడా ప్రభువు. ప్రణవ నాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞ వల్క్యస్మృతి చెప్పింది. "గణ్యంతే బుధ్యంతే తే గణాః" అన్నట్లు సమస్త దృశ్య మాన వస్తు ప్రపంచానికి అధిష్టాన దేవత గణపతి.  నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు విఘ్నేశ్వరుడు. దేవతా గణాలు ఉద్భవించి...

దుర్గాస్తోత్రం(యుధిష్టర కృతం)🌺

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥మంగళవారం " దుర్గాస్తోత్రం "తో అమ్మవారిని ప్రార్థించుదాం.. మహాభారతం విరాట పర్వం ఆరంభంలో పాండవులు అజ్ఞాతవాసానికై విరాటుని కొలువుకు వెళ్లేముందు ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించిన శ్లోకాలు.. ఆదిపరాశక్తి దుర్గ. ధర్మరాజు ఆ తల్లిని నారాయణుని సోదరిగా, కంసుని మరణానికి కారణమై, దానిని ఆ అసురునికి స్వయంగా తెలిపిన యోగమాయగా గ్రహించి నుతిస్తాడు.  ఎంతో భక్తితో ధర్మరాజు కొలువగానే అమ్మ ప్రత్యక్షమై "నాయనా! నీకు త్వరలోనే విజయం కలుగుతుంది. నా అనుగ్రహం వలన విరాటుని కొలువులో మీరుండగా మీ జాడను కౌరవులతో సహా ఎవ్వరూ తెలుసుకోలేరు. నన్ను స్మరించిన వారికి నేను సదా రక్షగా ఉంటాను" అని ఆశీర్వదిస్తుంది. మనం కొలిచే దుర్గా స్వరూపం సనాతనమైనదని చెప్పటానికి ఇది నిరూపణ. 🍁🍁🍁🍁🍁 🌺 శ్రీ దుర్గా స్తోత్రం (యుధిష్టర కృతం)🌺 విరాటనగరం రమ్యం - గచ్ఛమానో యుధిష్ఠిరః అస్తువ న్మనసా దేవీం - దుర్గాం త్రిభువనేశ్వరీం యశోదాగర్భసంభూతాం - నారాయణవరప్రియాం నందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీం కంసవిద్రావణకరీం - అసురాణాం క్షయంకరీం శిలాతటవినిక్షిప్తాం - ఆకాశం ప్రతి గామినీం వాసుదేవస్...

తస్మాత్ షష్ఠీ మహాతిథిః

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 వల్లీశ దేవసేనేశ భక్తపాలన తత్పర దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే!! కొలిచిన వారికి కొంగు బంగారమై, అభీష్టములు నెరవేర్చి, ఆయన పాదములను పట్టుకున్న వారికి ధర్మార్ధకామములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగిన వాడు.. అవ్యాజకరుణామూర్తి, ఎప్పుడూ చిద్విలాసముతో చిరునవ్వులొలికిస్తూ ఉండే నా బుజ్జి తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహ కటాక్షములు మనందరిమీదా వర్షించాలని.. బయటా, మన లోపలా ఉన్న ఆసురీ ప్రవృత్తిని సంహరించి, మనల్ని ధర్మమార్గములో నడపాలనీ, మన సనాతన ధర్మమును పరిరక్షించాలనీ.. గురుగుహా స్వరూపములో మన అజ్ఞాన తిమిరాలను పారద్రోలాలనీ శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. 🍁🍁🍁🍁🍁 💥సంస్కృత భారతములో వేదవ్యాసుల వారు షష్ఠీ ప్రాశస్త్యమును తెలుపుతూ “ తస్మాత్ షష్ఠీ మహాతిథిః” అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి దేవీభాగవతములో ఒక కథ కూడా కలదు. పూర్వం స్వాయంభువ మనువునకు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని ఇద్దరు కుమారులు కలరు. ఉత్తానపాదుడు ధృవుడు అన్న విషయం అందరికీ తెలిసినదే. ప్రియవ్...

ఓం నమో భగవతే మహా మృత్యుంజయాయ

Image
 ⚜️🕉️🚩 ఓం నమఃశివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱 🏵️🌼🏵️🌼🏵️ 💥సకల మృత్యుభయ దోష నివారణకు... " ఓం నమో భగవతే మహా మృత్యుంజయాయ " రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్‌ నమామి శిరసా దేవం కింనో మృత్యుః కరిష్యతి! మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్‌ జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః!! 🍁🍁🍁🍁🍁 శివమయం జగత్. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీలేదు. శివ శబ్దమే కల్యాణకారకం అని అర్థం. శివుడు సకల జగాలకు పాలకుడు. దిక్కులనే అంబరాలు ధరించినవాడు. జగమంతటికీ ఆకలి తీర్చే అన్నపూర్ణ సాక్షాత్తు ఆయన ధర్మపత్ని అయినప్పటి ఆయన మాత్రం ఆదిభిక్షువుగా పేరుగాంచాడు. శివుడు భక్తసులభుడు. 'హర హర మహాదేవ శంభో’ అన్నంతనే నేనున్నా నంటూ భక్తులను బ్రోచే భక్తవశంకరుడు. జడమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే లయకారుడు. మాయానాశకుని ఉదంతాన్ని తెలియచేయడానికే లింగోద్భవం జరిగిందంటారు. శివ, శక్తి రెండింటికీ ఒకే రూపం. అర్థనారీశ్వర తత్వం ఆకళింపుఅయితే పరమేశ్వరుని చిద్విలాసమే సృష్టి స్థితిలయలని అర్థం అవుతుంది.  శివారాధన హైందవ సంస్కృతిలో అంతర్భాగం. జనుల హృదయాల్లో ఉండే తమో గుణాన్ని తొలగించే జ్యోతి స్వరూపునిగా పరమేశ్వరు...

💥శ్రీరామనామ మహిమ:💥

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥జపము అనగా.. శ్లో// జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః/ తస్మాజ్జప ఇతి ప్రోక్తో జన్మ పాపవినాశకః // ‘జ’ కారము జన్మ నాశనమును (మోక్షమును), ‘ప’ కారము పాప నాశనమును సూచించును. అనగా పాపములను నాశనము చేసి, మరల జనన మరణములు లేకుండా మోక్ష మొసంగునట్టిది గనుకనే "జపం" అని చెప్పబడినది. శ్లో// ప్రణవో థనుః శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్య ముచ్యతే/ అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్// భగవన్నామమైన ‘ఓం’ కారము ధనుస్సు. ఆత్మయైన సాధకుడే బాణము. బ్రహ్మమును చేరుటే అతని లక్ష్యము. సాధకుడు అటువంటి ఓం కారము అనెడి థనస్సును ఊతము చేసుకుని, నిశ్చలమైన మనస్సుతో బ్రహ్మమును గురి చూసి కొట్టిన యెడల ఆత్మ బ్రహ్మము నందు జేరి తానే బ్రహ్మ స్వరూపుడగుచున్నాడు. 💥జపానికి ఇంతటి శక్తి ఉంటే! ఇక "శ్రీరామ" నామ జపానికి ఎంతటి శక్తి ఉన్నదో చెప్పుట మానవమాత్రుల వలన సాధ్యమా!? 💥శ్రీరామనామ మహిమ:💥 శ్లో// గాణాపత్యేషు శైవేషు శాక్త సౌరేష్వభీష్టశః వైష్ణవేష్వపి సర్వేషు రామ మంత్రః ఫలాదికః// #తాత్పర్యము: గణేశ, శైవ, శక్తి, సూర్య, వైష్ణవ మంత్రములన్నింటి కంటెనూ అధిక ఫలము ఈ రామ నామ జపము ...

💥వేదాల్లో సూర్యవైభవం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥వేదాల్లో సూర్యవైభవం💥 సూర్యుడు పరమాత్మ స్వరూపుడు. సూర్యస్యచక్షూ రజసైత్యావృతం తస్మినార్పిత భువనాని విశ్వా...' (ఋగ్వేదం) -సూర్యుని పైనే సమస్త ప్రాణికోటి ఆధారపడి ఉంది. ఆదిత్యోవా ఏష ఏతన్మండలం తపతి తత్రతా ఋచ:...'  -సూర్యుని ఆవరించి ఉండే తేజస్సు ఋగ్వేద స్వరూపం. ఆయన నుంచి లోకాలకు అందే వెలుగు సామవేదం. సాక్షాత్తు సూర్యభగవానుడే యజుర్వేద స్వరూపం అని అర్థం. ఘృణిస్సూర్య ఆదిత్యోం న ప్రభావాత్యక్షరం మధుక్షరన్తి తద్రసం...' (నారాయణోపనిషత్తు) -సముద్రాల్లోని ఉప్పు నీటిని తన కిరణాల ద్వారా గ్రహించి, తన ప్రభావం చేత ఆ ఉప్పు నీటిని తాగటానికి యోగ్యమైన నీరుగా, ఓషధీగుణాలు కలిగినదిగా మార్చి, మేఘాల ద్వారా వర్షింపజేస్తాడు సూర్యభగవానుడు.  ఈవిధంగా సూర్యభగవానుడి అనుగ్రహ ఫలితంగా అందిన వాన నీటి ద్వారానే పంటలు పండుతాయి. పంటల వల్ల మానవాళికి అన్న సమృద్ధి కలుగుతుంది. అంటే, సకల మానవాళి మనుగడకు సూర్యుడే జీవాధారం అని వేదం స్పష్టం చేస్తోంది. తరణిర్విశ్వదర్‌శతో జ్యోతిష్కృదశి సూర్య...' -చీకటితో నిండి ఉన్న సకల జగత్తు అంతా సూర్యుని కాంతి వల్లనే దృగ్గోచరమవు...

💥శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ అనంత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్న వారికి కోరినన్ని వరాలను ఇచ్చే దయామయుడు. అందుకే ఆ స్వామిని '#lకోటివరాలదేవుడు' అని పిలుస్తున్నారు. ఆ స్వామి నామస్మరణ సకల శుభకరం.  ఆ స్వామి 'నారాయణ' నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని రకాలైన దుఃఖాలను నేలమట్టం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి, పరమపదానికి చేరుస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం.. విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. 💥 శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥 ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || 1 || న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || 2 || మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్ మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || 3 || నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || 4 || రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్ కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || 5 || య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ యజ్ఞాంగ...

💥నర నారాయణులు💥🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ! పీతాంబర పరిధాన సురకళ్యాణనిధాన నారాయణ!! 💥నర నారాయణులు💥🙏 నరనారాయణ జననం లోక కళ్యాణ కారకం. మానవబ్రతుకు వేదమయిన భగవద్గీతకు మూలం కూడా వారే. జీవ బ్రహ్మైక్యతలకు నిలువెత్తు సాక్ష్యం. విశ్వగురుడు పరమాత్మ. విశ్వ విద్యార్థి పరమాత్మే. వారే జీవాత్మలు కూడా. నర నారాయణుల కలయికయే ఒక అద్భుత సృష్టి. మాధవునితోనే మానవుడు. మానవునిలోనే మాధవుడు. నిజం తెలిస్తే సర్వం బ్రహ్మమయం. 🍁🍁🍁🍁🍁 💥నరనారాయణుల వేల సంవత్సరాల తపస్సునకు ఒక లక్ష్యం ఉంది. అదే "సహస్ర కవచుని" సంహారం. సహస్ర కవచుడు ఒక రాక్షసుడు. పుట్టుకతోనే వేయి కవచములను శరీరంలో కలిగి యున్నాడు. వానితో పోరు సలపాలంటే వేయి సంవత్సరాల తపోబలం కావాలి. వాడి సంహారం కానట్లయితే దివిజులకు, మానవులకు, మహర్షులకు కంటకమవుతుంది. ధర్మం నశిస్తుంది. జన జీవన విధానానికి విఘాతం ఏర్పడుతుంది. అందుకే నర నారాయణులుగా వైష్ణవతేజం ఆవిర్భవించింది.  నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడు, నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడు ఇలా సహస్ర కవచునితో తలపడ్డారు. ఒక్కొక్కమారు ఒక్కో కవచం చొప్పున నర నారాయణులు ఆ రాక్షసుని 99...

💥అమ్మలగన్న యమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అమ్మలగన్న యమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ కారణం లేని కార్యం, మరణం లేని పుట్టుక ఉండవు. "ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం పెచ్చు మీరినప్పుడు సాకార రూపంతో లోకంలో నేను అవతరించి సత్పురుషులను రక్షిస్తాను. దుష్టులను శిక్షిస్తాను" అంటాడు కృష్ణపరమాత్ముడు భగవద్గీతలో.  దేవీ భాగవతంలో కూడా.. జగన్మాత, దేవిగా అవతరించి చెడుపై పోరాడి మంచిపై విజయం సాధిస్తుందని చెప్పబడింది.  అమ్మలఁగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలాఁ బె ద్దమ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వేలుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి యిచ్చు త మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌ 🌹దుర్గాదేవి తల్లులందరికీ తల్లి. ముగ్గురమ్మలు.. లక్ష్మీ, సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి. లోకాలన్నింటా నిండి ఉన్న శక్తి స్వరూపిణి. దేవతలకు శత్రువులైన రాక్షసుల తల్లులకు గర్భశోకాన్ని కలిగించిన తల్లి. అనగా లోక కంటకులైన రాక్షసులను సంహరించిన స్వరూపం. తనను నమ్ముకున్న అష్టమాతృకలకు శక్తినిచ్చిన తల్లి. అంత గొప్పదైన మా అమ్మ.. సముద్రమంత కరుణ కలిగిన దుర్గమ్మ.. నాకు దయతో కవిత్వ, మహత్వ, పటుత్వ సంపదలు ...

అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠం కొల్హాపూర్‌

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥  💥సమస్త మానవాళికి శక్తిని... ఉత్సాహాన్ని... ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రజోగుణాధీశ్వరి. ఆమె ఈ సృష్టినంతటినీ శాసిస్తున్న పరమేశ్వరి. అల వైకుంఠ పురిలో ఉన్న అమ్మవారు భక్తుల కోసం ఇలపై వెలిసిన క్షేత్రమే కొల్హాపూర్‌ అన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది.  సతీదేవికి చెందిన నయనాలు ఈ క్షేత్రంలో పడ్డాయన్నది పురాణగాధ.  💥ఫలం.. గద.. కవచం.. పాత్రను నాలుగు చేతుల్లో కలిగి ఉన్న ఆ దివ్యమంగళరూపాన్ని ఎంత సేపు చూసినా తనివి తీరదు. స్థానికులు అంబాబాయిగా పిల్చుకునే లక్ష్మీదేవి భక్తులకు సదా ఆశీర్వచనాలు ఇస్తుంటుంది. ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షిస్తే.. నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మీ అమ్మవారు తన కరములతోపైకి ఎత్తిందట! అందుకే ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందట! ఈ మందిరానికి అవిముక్తేశ్వర క్షేత్రమని కూడా పేరుంది. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత ...

💥ఓం నమో పుండరీక వరదాయా..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో పాండురంగాయ🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ జై జై విఠల పాండురంగ జై హరి విఠల పాండురంగ ఆపద్బాంధవ పాండురంగ అనాధరక్షక పాండురంగ 💥ఓం నమో పుండరీక వరదాయా. . శ్రీ పాండురంగ స్వామి వారి లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. శ్రీ పాండురంగ స్వామి వారిని "#విఠలుడు" అని కూడా పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షసిద్దిని ప్రసాదించడానికి గాను పండరీపుర క్షేత్రంలో "పాండురంగడు"గా అవతరించాడని పురాణాల ద్వారా అవగతం అవుతున్నది. 💥పుండరీకుని కధ: పూర్వం ముచుకుందుడనే రాజు అసురులమీద యుధ్ధం చెయ్యటంలో దేవతలకు సహాయం చేయగా, దేవతలు విజయం పొందారు. ముచుకుందుడు దీర్ఘకాలం యుధ్ధం చేసి అలసి పోవటం వల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి, తనని నిద్ర లేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతలద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు. శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధం చేస్తూ అతడు ఏ ఆయుధం చేతా మరణించడని గ్రహించి, ముచుకుందుడు నిద్రించే స్ధలానికి తీసుకువచ్చాడు.  నిదురిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చెయ్యటం, అతని చూపు పడి మరణించటం, ముచుకుందునికి...

💥 మౌన గురువు.. రమణమహర్షి.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 మౌన గురువు.. రమణమహర్షి. శ్రీ రమణ భగవాన్ సన్నిధి ఒక అరుదైన విచిత్ర అనుభూతి. ఇలాంటి అనుభూతి  వేరే చోట ఎక్కడా లభించదు. ఆయన మౌన సందేశానికి హృదయకమలాలు  వికశించి  జ్ఞాన బాండాగారం తెరుచుకొంటుంది. ఆయన ఆత్మ ఆశ్రమమంతా  కిరణప్రసారం  వెదజల్లుతుంది. ఆయన ముందు కూర్చుంటే చాలు మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇట్టే లభిస్తాయి. దక్షిణామూర్తి లాగా ఆయన మౌన వ్యాఖ్యాన పరబ్రహ్మ. ఆయనను ఒక్కసారి చూస్తే చాలు మన హృదయాలు ప్రక్షాళనమై పవిత్రవంతాలవుతాయి. శ్రీ రమణ మహర్షిది ఒకటే ప్రశ్న - "నేను ఎవరిని?" అది వేసుకొంటే సాధకునికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. 💥ఈ ప్రపంచము సుఖం కోసం సృష్టించబడిందా? దుఃఖం కోసం సృష్టించబడిందా? అని ఒక పుస్తకంలో ఉన్న ప్రశ్న గురించి రమణులు ఏం చెప్పారో చూడండి... సృష్టి మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది ఉన్నట్లే ఉన్నది. మానవుని మనస్సు దానిని తన కోణం నుంచి చూస్తూ తనకు అనుకూలమైనట్లు వ్యాఖ్యానిస్తుంది.... ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటికీ ఈ సంబంధాలే కారణం. సృష్టి ఒక రావిచెట్టు వంటిది. పక్షులు దాని పండ్లు తినడానికి వస్తూ ఉంటాయి. ...

💥ఉగ్ర నారసింహుని అవతారతత్త్వం!

Image
 ⚜️🕉️🚩ఓం లక్ష్మీనృశింహాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥ఉగ్ర నారసింహుని అవతారతత్త్వం! రామకృష్ణాది అవతారముల వలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారం శ్రీ నరసింహుడు. నారసింహుని పూజలతో, అకాల మృత్యు భయం ఉం.డదని, దుష్టగ్రహ బాధలు, పైశాచిక చేతబడుల ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి నారసింహ మంత్రానికి గలదని భక్తుల, సాంప్రదాయాచరణాసక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం పగలు రాత్రి కాని సంధ్యా సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవమూ కాని చేతి గోళ్ళతో, హరణ్య కశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, అంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అవతారాలకు భిన్నమైనది. దుష్టశిక్షణ శిక్ష రక్షణ సర్వాంతర్యామిత్వం, భక్తుని మాటను నిజం చేయడం... నమ్మినబంటును శాప విముక్తుని గావించడం, ఎన్ని నియంత్రణలు, వరాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వైరి కోరుకున్న విధంగానే శతృవధ చేయడం, సూక్ష్మం నుండి స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం నరసింహావతారంలో విశిష్టతలు...

💥అనంతం.. అద్భుతం.. దుర్వాంకురం.

Image
 ⚜️🕉️🚩ఓం మహాగణపతయే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ పదహారు నామాలు ఉన్నవాడు.. ముప్పైరెండు రూపాల వాడు.. అరవైనాలుగు కళల్లో ఆరితేరిన రేడు... వినాయకుడు. వికట రూపంతో అందరినీ అలరిస్తాడు. యోగ గణపతిగా సాధకుల తోడు నిలుస్తాడు. ఉచ్ఛిష్ట మూర్తిగా కష్టాలను హరిస్తాడు. సంకష్ట మూర్తిగా సంకటాలను దూరం చేస్తాడు.  ఘంటం పట్టి భారతం రాసిందీ ఆయనే! ఉద్దండ రూపంతో దుష్టశక్తుల భరతం పట్టేదీ ఆతడే!! గిరితనయ గారాలపట్టిగా.. కరిరాజ ముఖునిగా.. తొలిపూజలు అందుకుంటున్న మహాగణపతిని మనసారా స్మరించుకుందాం. కొండంత దైవం గురించి గోరంత తెలుసుకుందాం. 💥అనంతం.. అద్భుతం.. దుర్వాంకురం. దుర్వాంకురం అంటే ‘గరిక’. గణపతికి గరిక అంటే ప్రీతి. దాని మహిమ గురించి తెలుసుకుందాం. మిథిలానగరంలో విరోచనుడు, సులోచన దంపతులు ఉండేవారు. వీరు గణేశుని భక్తులు. ఒకసారి గణేశుడు వీరి భక్తికి మెచ్చి, వారింటికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో వెళ్ళాడు. వారు చాలా బీదవారు. కూర్చోడానికి కుర్చీ కాని, మరే ఆసనమైనా లేని వాళ్ళు.. ఇంట్లో ఒక మూల గణపతి ప్రతిమను ఉంచి పూజిస్తున్నారు. ఆ పరిస్థితిలో వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో వచ్చిన గణపతి "ఓ! పుణ్య దంపతులారా! నేనొక బీద బ్రాహ్మణుడను. న...

💥సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి వైభవం:

Image
 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ శివశక్తుల అనురాగమునకు ఫలము, జ్ఞాన పండిత అని కీర్తించబడ్డ వాడు, గజముఖానుజుడు, దేవసేనాపతి, వల్లీనాయకుడు అయిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వైభవమును తలచుకుని స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులమౌదాము. 💥సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి వైభవం: షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న "సుబ్రహ్మణ్యారాధన" అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము. అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు.  అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది. పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే కుమారస...

💥హనుమంతుడు - సూర్యుడు

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥ప్రతిరోజు పఠించాల్సిన శ్లోకం:💥 ప్రభాకరాత్మజాం సుమేరు చారువర్ణ శోబితాం! విరాజమాన పంకజద్వయాత్తహస్తవైభవాం! ధరాత్మజాపతి ప్రసాదప్రాప్త ధన్యజీవితాం! నమామితాంవరప్రదాంరమాకళాం సువర్చలాం!! 💥హనుమంతుడు - సూర్యుడు ఆంజనేయుడు పసివాడుగా ఉన్నప్పుడే ఉదయ సూర్యుణ్ని పండుగా భావించాడు. అంతే ఆదిత్యుణ్ని ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు.  ఈ సందర్భాన్నే... యుగ సహస్ర యోజన పరభానూ/ లీల్యోతాహి మధురఫల జానూ - అని హనుమాన్‌ చాలీసా 18వ చౌపాయీలో తులసీదాసు పేర్కొన్నాడు.  ఇక్కడ ‘యుగ సహస్ర యోజన’ అంటే లెక్కించలేనంత దూరం అని అర్థం. యోజనం అంటే సుమారు 13 కిలోమీటర్లు. కొంతమంది మాత్రం యుగ అంటే 12,000గా తీసుకొని, సహస్రం (1,000), యోజనం (13 కిలోమీటర్లు) తో గుణించి 15 కోట్ల కిలోమీటర్లని లెక్కించారు. ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం భూమికి, సూర్యుడికి మధ్య దూరం రమారమీ ఇంతే అని తేలింది. ఆంజనేయుడి అపరిమిత బలాన్ని వర్ణించడానికి మాత్రమే తులసీదాసు ఈ పదాలు ప్రయోగించాడని తెలుస్తున్నది. 💥బాల ఆంజనేయుడు సూర్యుణ్ని మింగబోతుంటే దేవతలంతా భయభ్రాంతులకు లోనయ్యారు. మారుతిని నిలువరించడానికి దేవేంద్...

💥శివద్రుమము (మారేడు)

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ🌹 🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 🏵️🌼🏵️🌼🏵️ 💥 శివద్రుమము (మారేడు) మారేడు చెట్టును త్రిమూర్తి స్వరూపంగా, లక్ష్మీ రూపంగా కూడా ఆరాధిస్తారు. మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును "శివేష్ట" అని అంటారు. మారేడును "బిల్వ" అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు. 💥#బిల్వాష్టకం.. ...