💥గురువాయూరప్పన్💥

 ⚜️🕉️🚩ఓం శ్రీ గురువాయూరప్పనే నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥గురువాయూరప్పన్💥


నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడు రూపం.. "గురువాయూరప్పన్"


పవిత్రమైన విష్ణుక్షేత్రం.. దక్షిణ ద్వారకగా పిలవబడే.. కేరళ లోని "గురువాయూరు"లో.. స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు.


శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.

దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి.


💥#పురాణగాధ:


ఐదువేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది.


ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. 


పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ..

ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ..

తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. 


స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి.


ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి - వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట.


అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట.

అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం.


గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది.


తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు.

అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌.


వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.


💥ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు.

దీన్నే "నిర్మలదర్శనం" అంటారు.


రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టు పీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు.


బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు.


పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు.


108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశంగా మారింది.


💥గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు.

ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం.


అలాగే స్వామి సమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు.


ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం.

తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.


💥గురువాయూరప్పన్ మహిమలు:


#భక్తురాలు.. #మంజుల_కథ 


మంజుల గురువాయూరప్పన్‌కు గొప్ప భక్తురాలు.

ప్రతి రోజూ ఆమె పువ్వులు సేకరించి అందమైన దండను తయారు చేసి గుడికి వెళ్లేది.

పూజారి గురువాయూరప్పన్‌కు ఆ పూలమాలను అలంకరిస్తారు.

భగవంతుని దర్శనం చేసుకుని, ఆయన మహిమలు పాడిన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చేది.

ఇది గురువాయూరప్పన్‌కు  ఆమె నిత్య మాలా కైంకర్యం .


అయితే ఒకరోజు ఆలస్యమై ఆమె పూలదండతో గుడికి చేరుకునే సరికి ఆరోజు గుడి మూతపడింది.

ఆ మాల స్వామికి సమర్పించ లేక పోయినందుకు చాలా బాధపడింది.

మెల్లగా గుడి దగ్గరున్న మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి కూర్చుంది.

కళ్లలో నీళ్లతో శ్రీకృష్ణుని మహిమలు పాడటం మొదలుపెట్టింది.


భగవంతుని దర్శనం కోసం వచ్చిన శ్రీగురువాయూరప్పన్ యొక్క మరొక గొప్ప భక్తుడు పూంథానం ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.

భగవంతుని పాట విని మంజుల ఏడుపు చూసి అక్కడికి వచ్చాడు. విషయమేమిటని ఆమెను అడిగాడు. 


భగవంతునికి రోజూ చేసే మాల-సేవ గురించి ఆమె అతనికి చెప్పింది. ఆ రోజు ఆలస్యమవడం వల్ల గుడి మూసేయడంతో స్వామికి మాల సమర్పించలేక పోయింది.


మంజుల యొక్క హృదయ పూర్వక భక్తిని పూంథానం గ్రహించాడు.

అతను చిరునవ్వు నవ్వి, కంగారు పడవద్దని చెప్పాడు. 


భగవంతుడు సర్వవ్యాపకుడు మరియు ప్రతి 'వస్తువు మరియు జీవి'లో ఉన్నాడు కాబట్టి అతను ఆమెను మర్రి చెట్టు క్రింద ఉన్న రాయిపై దండ వేయమని కోరాడు. అందువల్ల, నైవేద్యం భగవంతుని వద్దకు చేరుతుంది అని మహా కృష్ణ భక్తుని మాటలు విని మంజుల ఆ రాయిపై దండ వేసి ఇంటికి తిరిగి వెళ్ళింది.


మరుసటి రోజు తెల్లవారుజామున, ప్రధాన పూజారి ఆలయం తలుపులు తెరిచి, గర్భగుడిలోకి నడిచి, స్వామిని అలంకరించిన మునుపటి రోజు దండలను తొలగించడం ప్రారంభించాడు.


ఒక్కొక్కటిగా దండలన్నీ తీసేసినా ఒక దండ తీయలేక పోయాడు. పూజారి మరియు అక్కడ గుమిగూడిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు.


అదే సమయంలో పూంథానం ఆలయానికి వచ్చారు. పూజారి కలవరపడటం చూసి, విషయమేమిటని అడిగాడు. పూజారి జరిగిన విషయం చెప్పాడు.


అతను భగవంతుని విగ్రహాన్ని అలంకరించిన ఒక దండను తీసివేయలేక పోయాడు.

పూంథానం కు అంతకు ముందు రాత్రి జరిగిన విషయం వెంటనే గుర్తుకు వచ్చింది.


అతను ఆనందంగా అరిచాడు, “అది మంజుల మాల అయితే పడిపోవాలి”

అంతే.. దండ వెంటనే కింద పడింది!

పూజారితో సహా భక్తులందరూ శ్రీ గురువాయూరప్పన్‌కు మంజుల యొక్క సంపూర్ణ శరణాగతి, సంపూర్ణ భక్తి మరియు ప్రేమపూర్వక సేవను గ్రహించారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు