💥ఓం నమో పుండరీక వరదాయా..
⚜️🕉️🚩 ఓం నమో పాండురంగాయ🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
జై జై విఠల పాండురంగ జై హరి విఠల పాండురంగ
ఆపద్బాంధవ పాండురంగ అనాధరక్షక పాండురంగ
💥ఓం నమో పుండరీక వరదాయా..
శ్రీ పాండురంగ స్వామి వారి లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం.
శ్రీ పాండురంగ స్వామి వారిని "#విఠలుడు" అని కూడా పిలుస్తారు.
శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షసిద్దిని ప్రసాదించడానికి గాను పండరీపుర క్షేత్రంలో "పాండురంగడు"గా అవతరించాడని పురాణాల ద్వారా అవగతం అవుతున్నది.
💥పుండరీకుని కధ:
పూర్వం ముచుకుందుడనే రాజు అసురులమీద యుధ్ధం చెయ్యటంలో దేవతలకు సహాయం చేయగా, దేవతలు విజయం పొందారు.
ముచుకుందుడు దీర్ఘకాలం యుధ్ధం చేసి అలసి పోవటం వల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి, తనని నిద్ర లేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతలద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు.
శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధం చేస్తూ అతడు ఏ ఆయుధం చేతా మరణించడని గ్రహించి, ముచుకుందుడు నిద్రించే స్ధలానికి తీసుకువచ్చాడు.
నిదురిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చెయ్యటం, అతని చూపు పడి మరణించటం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనం కావటం జరిగాయి.
ఆ ముచుకుందుడే మరు జన్మలో పుండరీకుడిగా జన్మించాడు.
పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళే దోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా..
వారు తాము గంగ, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాలవల్ల తమకి ఆ దుస్ధితి వస్తుందని, కుక్కుటముని లాంటి మహనీయుల సేవలో ఆ పాపాలు పోయి యధా స్ధితికి వస్తామని పేర్కొన్నారు.
కుక్కుటమునికి అంత మహిమ తన మాతాపితరుల సేవతో వచ్చిందని కూడా తెలిపారు.
పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవచేయసాగాడు.
ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు.
పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతా పితరులకు నిద్రా భంగమవుతుందని, అందుకని కొంత సేపు వేచి వుండమని తన చేతికి అందుబాటులో వున్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి వుండమంటాడు.
భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుక మీదే నుంచుని వుంటాడు.
పుండరీకుని భక్తికి, మాతా పితరుల సేవాతత్పరతకు మెచ్చి వరము కోరుకోమనగా, అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు.
విఠలుడు అనే పేరు విట్టు లోంచి వచ్చిందంటారు.
విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక. అందువలన అప్పటినుండి స్వామిని విఠలుడు అని పిలుస్తారు.
🍁🍁🍁🍁🍁
💥ఆ పండరీ పుర వాసుని స్తుతిస్తూ జగద్గురువులు రచించిన పాండురంగాష్టకము.. తాత్పర్యము మీకోసం.
💥#పాండురంగాష్టకం - #తాత్పర్యము
మహాయోగపీఠే తటే భీమరథ్యా
వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః |
సమాగత్య తిష్ఠంతమానందకందం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 1 ||
🌹తాత్పర్యము:
మహాయోగ పీఠం అయిన పండరీపురంలో, భీమ రథీ తీరంలో, మునీన్ద్రులతో కూడి పుండరీకునికి వరములిచ్చిన, అనంతమైన ఆనందమునకు మూలమైన, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.
తటిద్వాససం నీలమేఘావభాసం
రమామందిరం సుందరం చిత్ప్రకాశం |
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 2 ||
🌹తాత్పర్యము:
తన పాదపద్మములను ఇటుకలో స్థిరముగా ఉంచిన వాడు (విఠలుడు), మెరుపు తీగవలె అలంకరించబడిన వాడు, నీల మేఘ శ్యాముడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, సుందరమైన వాడు, ప్రకాశించే అంతరంగము కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.
ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం
నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ |
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 3 ||
🌹తాత్పర్యము:
చేతులను వంచి నడుముపై ఉంచుకొని ఈ మిథ్యా ప్రపంచమంతా నడుములోతు వరకే అని సందేశాన్ని ఇచ్చే, తన నాభి నుండి కమలమును సృష్టించి అందులో బ్రహ్మకు నివాసము ఏర్పరచిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.
స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే
శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసం |
శివం శాంతమీడ్యం వరం లోకపాలం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 4 ||
🌹తాత్పర్యము:
కౌస్తుభ మణిని మెడలో ధరించిన వాడు, అందమైన భుజకీర్తులు కలవాడు, అందంగా అలంకరించబడిన కురులు కలవాడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, శాంతమైన వాడు, శుభకరుడు, జగత్తును కాపాడే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.
శరచ్చంద్రబింబాననం చారుహాసం
లసత్కుండలాక్రాంతగండస్థలాంతం |
జపారాగబింబాధరం కంజనేత్రం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 5 ||
🌹తాత్పర్యము:
శరత్కాలములోని చంద్రుని వంటి ముఖము కలవాడు, సమ్మోహనము కలిగించే చిరునవ్వు కలవాడు, మెరిసే కర్ణ కుండలములు చెంపలపై వరకు కలవాడు, ఎర్రని మందారము రంగులో, దొండపండు వంటి పెదవి కలవాడు, కలువ పూల వంటి కళ్ళు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.
కిరీటోజ్వలత్సర్వదిక్ప్రాంతభాగం
సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః |
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 6 ||
🌹తాత్పర్యము:
నలుదిక్కుల ప్రసరించే ప్రకాశము గల కిరీటమును ధరించిన వాడు, దేవతలచే అమూల్యమైన రత్నములతో పూజించబడే వాడు, మూడు వంపుల ఆహర్యములో నిలబడిన వాడు, వన మాలలు, శిఖి పించము ధరించిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.
విభుం వేణునాదం చరంతం దురంతం
స్వయం లీలయా గోపవేషం దధానం |
గవాం బృందకానందదం చారుహాసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 7 ||
🌹తాత్పర్యము:
సర్వ వ్యాప్తమైన వాడు, వేణువును వాయించే వాడు, దుష్టుల పాలిటి చరమ గీతమైన వాడు, ఆటగా గోపాలుని వేషములో ఉండేవాడు, గోవులకు ఆనందము కలిగించే వాడు, వికసించిన కలువ వంటి చిరు నవ్వు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.
అజం రుక్మిణీప్రాణసంజీవనం తం
పరంధామ కైవల్యమేకం తురీయం |
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 8 ||
🌹తాత్పర్యము:
జననము లేని వాడు, రుక్మిణీ వల్లభుడు, అనంతమైన ప్రకాశకుడు, ఏకైక మోక్ష కారకుడు, నాలుగవ స్థితి (తురీయం) అయిన వాడు, ప్రసన్నుడు, దేవ దేవుడు, శరణాగతుల ఆర్తిని పోగొట్టే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.
స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే
పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యం |
భవాంభోనిధిం తే వితీర్త్వాంతకాలే
హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి || 9 ||
🌹తాత్పర్యము:
పాండురంగని నుతించే ఈ స్తోత్రాన్ని భక్తి మరియు శ్రద్ధతో పఠించే వారు సులభముగా సంసార సాగరాన్ని దాటి, విష్ణు లోక నివాసము పొందుతారు.
ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ పాండురంగాష్టకం సంపూర్ణం ||
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment