అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠం కొల్హాపూర్‌

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।

సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 


💥సమస్త మానవాళికి శక్తిని... ఉత్సాహాన్ని... ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రజోగుణాధీశ్వరి.

ఆమె ఈ సృష్టినంతటినీ శాసిస్తున్న పరమేశ్వరి.


అల వైకుంఠ పురిలో ఉన్న అమ్మవారు భక్తుల కోసం ఇలపై వెలిసిన క్షేత్రమే కొల్హాపూర్‌ అన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. 

సతీదేవికి చెందిన నయనాలు ఈ క్షేత్రంలో పడ్డాయన్నది పురాణగాధ. 


💥ఫలం.. గద.. కవచం.. పాత్రను నాలుగు చేతుల్లో కలిగి ఉన్న ఆ దివ్యమంగళరూపాన్ని ఎంత సేపు చూసినా తనివి తీరదు.

స్థానికులు అంబాబాయిగా పిల్చుకునే లక్ష్మీదేవి భక్తులకు సదా ఆశీర్వచనాలు ఇస్తుంటుంది.


ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షిస్తే.. నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మీ అమ్మవారు తన కరములతోపైకి ఎత్తిందట! అందుకే ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందట!

ఈ మందిరానికి అవిముక్తేశ్వర క్షేత్రమని కూడా పేరుంది.


ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా,

శివుడు నీరుగా, విష్ణువు రాయిగా,

మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా,

మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. 


💥స్థలపురాణం:

అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు.

ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు.

అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు.


శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు.

అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు.


కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట.


శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది.


💥శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగుమహర్షి వచ్చాడు. అయితే ఋషి రాకను విష్ణువు గమనించలేదు.

దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లి కొల్హాపూర్‌ సమీపంలో తపస్సులో మునిగిపోయింది. 


భృగువు పాదంలో కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు ఋషి గర్వాన్ని అణచివేశాడు.

అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.


💥కిరణోత్సవం:

సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడు రోజులు గర్భాలయంలోకి సూర్య కిరణాలను ప్రసారిస్తాడు.

తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి.

ఈ ఉత్సవాలను కిరణ్‌ ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం