అనందతేజో స్వరూపం దత్తాత్రేయమహం భజే

 ⚜️🕉️🚩 ఓం దత్తాయ నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


అనసూయాత్రి సంభవం అఖండ జ్ఞాన వైభవం |

అనందతేజో స్వరూపం దత్తాత్రేయమహం భజే ||


త్రిగుణ రహితం దేవం త్రిమూర్తి స్వరూపం విభుం |

సద్గురుం కరుణామయం దత్తాత్రేయమహం భజే ||

🍁🍁🍁🍁🍁


శ్రీ దత్తుడు గురువు, దైవమూ కూడా.

అందుకే ఆయనను 'గురుదేవదత్త'గా కొలుస్తారు.


స్మరించిన మాత్రమునే సంతుష్టుడై సంరక్షిస్తాడని 'స్మర్తృగామి' అని కీర్తిస్తారు.


తత్త్వ జ్ఞానాభిలాషులకు "యోగి"లా, ఇతరులకు "భోగి"లా దర్శనమిచ్చే శ్రీ దత్తుడు, ఐహికాముష్మిక ఉభయ ఫలప్రదాత.

జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే భక్తసులభుడు.


యోగమే శ్రీ దత్తుని మార్గం.

నిస్సంగత్వమే శ్రీ దత్తుని ఉపదేశం.

జ్ఞానమే శ్రీదత్తుని ఉపాసన.


దత్తాత్రేయస్వామి వారు పరస్పర విరుద్ధరూపాలలో తిరుగుతుంటారు.

భక్తులను కఠినంగా పరీక్షిస్తుంటారు.


ఒక్కోసారి జటామండలధారిగా మరుక్షణంలో ముండిత శిరస్కుడుగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతాంబరుడుగా, పీతాంబరుడిగా, కనిపిస్తారు. 


ఒక్కోసారి మహా విద్వాంసుడిగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడిగా, మదమత్తుడిగా, కనిపిస్తారు.


ఒకోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు.

ఒకోసారి మహైశ్వర్య సంపన్నుడిగా కనిపిస్తారు.

నిజమైన రూపం ఏది అనేది ఎవ్వరికీ తెలియదు. అంతుపట్టని రహస్యం, హర, హరి, హిరణ్యగర్భులుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడవుతాడు.


గంగలో స్నానం చేసి, కొల్హాపురిలో బిక్షచేసి, సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటారు.


త్రికరణశుద్ధిగా స్మరిస్తే భక్తులకు కనిపిస్తారు.

స్మర్త్రగామి అనేది ఈ స్వామికి గొప్ప బిరుదు. 


అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః

తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే!!


శ్రీ దత్తాత్రేయుడు మూర్తిత్రయాత్మక స్వరూపుడు

(మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే)

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకత్వాన్ని సూచించే స్వరూపం.


స్థూల సూక్ష్మ కారణము లనెడు దేహత్రయమును దత్తముజేసినవాడు (దత్తమనగా ఇవ్వబడిన లేక త్యజింపబడిన) దత్తాత్రేయుడు.

దేహత్రయాతీత సాక్షిచైతన్య స్వరూపుడు.


జాగ్రత్ స్వప్న సుషుప్తులనెడి అవస్థాత్రయం లేనివాడు దత్తాత్రేయుడు.

సత్వ, రజో, తమో గుణాలు మూడింటికీ అతీతుడైనవాడు దత్తాత్రేయుడు.


అకార ఉకార మకారములనెడు మూడు మాత్రలకు మూడక్షరములకు మూలస్వరూపుడై, త్రిమూర్తులకు పరమై, సత్య జ్ఞానానంద మూర్తియైన శ్రీ దత్తాత్రేయుడు షోడశ కళా పరిపూర్ణుడైన పరబ్రహ్మతత్త్వంకు ప్రతీక.

సేకరణ...💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు