💥అమ్మ స్వరూపం - ఆశ్వీయుజమాసం💥
⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥అమ్మ స్వరూపం - ఆశ్వీయుజమాసం💥
అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వీయుజ మాసం అంటారు.
ఆశ్వీయుజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గల కారణం “అమ్మ” గుర్తుకు రావటమే!
అమ్మ అంటే మరి ఎవరో కాదు.. ఆ జగన్మాత.
ముగ్గురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గాస్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే,
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే!!
ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని..
ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని.. సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది.
"ఆశ్వీయుజమాసం"లోని శుక్ల పక్షంలో పాడ్యమి తిథిలో, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభ దినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది.
అందువల్ల ఆ రోజునుండి నవరాత్రులు ప్రారంభిస్తారు.
మొదటి మూడురోజులు #దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను,
తదుపరి మూడు రోజులు #లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరిసంపదలను,
చివరి మూడు రోజులలో #సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి.
💥దేవతలు భండాసురుడనే రాక్షసుని బారినుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గము లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు.
ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యింది.
వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.
ఆ దేవి "పాడ్యమి" నుండి "నవమి" వరకు ఒక్కోరోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది.
ఆ ఆది శక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు "#నవదుర్గలు"గా..
1. శైలపుత్రి
2. బ్రహ్మచారిణి
3. చంద్రఘంట
4. కుష్మాండ
5. స్కందమాత
6. కాత్యాయనీ
7. కాళరాత్రి
8. మహాగౌరి
9. సిద్ధిధాత్రి
-అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది.
💥బ్రహ్మదేవుడు మధు కైటభులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు.
పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయము నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు.
దేవేంద్రుడు దుర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగిగాడు.
మానవులను "మానవులు"గా తీర్చిదిద్ది..
మ అనగా మాయ.. న అంటే లేకుండా.. వ అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి..
తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం.
అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా..
మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా..
దారిద్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై..
ఈదేవి నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతో పాటు "ఖడ్గమాల స్తోత్రం", "శ్రీలలితా సహస్రనామ" పారాయణ నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment