💥శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
అనంత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్న వారికి కోరినన్ని వరాలను ఇచ్చే దయామయుడు. అందుకే ఆ స్వామిని '#lకోటివరాలదేవుడు' అని పిలుస్తున్నారు.
ఆ స్వామి నామస్మరణ సకల శుభకరం.
ఆ స్వామి 'నారాయణ' నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని రకాలైన దుఃఖాలను నేలమట్టం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి, పరమపదానికి చేరుస్తుంది.
విష్ణు సహస్రనామ స్తోత్రం.. విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది.
💥శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥
ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || 1 ||
న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || 2 ||
మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || 3 ||
నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || 4 ||
రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || 5 ||
య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః || 6 ||
ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః || 7 ||
య యజ్ఞకర్తే యజ్ఞభర్తే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయా2స్తు యకారాయ నమో నమః || 8॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment