💥 మౌన గురువు.. రమణమహర్షి.

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥 మౌన గురువు.. రమణమహర్షి.


శ్రీ రమణ భగవాన్ సన్నిధి ఒక అరుదైన విచిత్ర అనుభూతి. ఇలాంటి అనుభూతి  వేరే చోట ఎక్కడా లభించదు.


ఆయన మౌన సందేశానికి హృదయకమలాలు  వికశించి  జ్ఞాన బాండాగారం తెరుచుకొంటుంది.

ఆయన ఆత్మ ఆశ్రమమంతా  కిరణప్రసారం 

వెదజల్లుతుంది.

ఆయన ముందు కూర్చుంటే చాలు మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇట్టే లభిస్తాయి.


దక్షిణామూర్తి లాగా ఆయన మౌన వ్యాఖ్యాన పరబ్రహ్మ.

ఆయనను ఒక్కసారి చూస్తే చాలు మన హృదయాలు ప్రక్షాళనమై పవిత్రవంతాలవుతాయి.


శ్రీ రమణ మహర్షిది ఒకటే ప్రశ్న - "నేను ఎవరిని?"

అది వేసుకొంటే సాధకునికి ఆత్మజ్ఞానం కలుగుతుంది.


💥ఈ ప్రపంచము సుఖం కోసం సృష్టించబడిందా?

దుఃఖం కోసం సృష్టించబడిందా? అని ఒక పుస్తకంలో ఉన్న ప్రశ్న గురించి రమణులు ఏం చెప్పారో చూడండి...


సృష్టి మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది ఉన్నట్లే ఉన్నది. మానవుని మనస్సు దానిని తన కోణం నుంచి చూస్తూ తనకు అనుకూలమైనట్లు వ్యాఖ్యానిస్తుంది.... ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటికీ ఈ సంబంధాలే కారణం.


సృష్టి ఒక రావిచెట్టు వంటిది.

పక్షులు దాని పండ్లు తినడానికి వస్తూ ఉంటాయి. మనుష్యులు దాని నీడలో చల్లదనం కోసం వస్తారు.

కొంతమంది ఆ చెట్టకు ఉరిపోసుకుని చచ్చిపోతారు.


కానీ ఆ చెట్టు వీటన్నింటితో ఏమీ సంబంధం లేకుండా, ఇవేమీ గుర్తించకుండా తన పాటికి తాను జీవిస్తూ ఉంటుంది.

మానవుడి మనస్సే కష్టాలను సృష్టించుకుని సహాయం కోసం అలమటిస్తూ ఉంటుంది.


ఒక మనిషికి కష్టాలిచ్చి మరొకడికి సుఖాలీయటానికి భగంతుడికంత పక్షపాతం ఉంటుందా?


సృష్టిలో అన్నిటికీ చోటు ఉంటుంది.

కానీ ఒక క్షుథార్తుడు ప్రక్కనే రుచికరమైన తిండి ఉండగా దాని వైపు చేయి జాపి ఆకలి తీర్చుకోకుండా ఉన్నట్లు, మానవుడు సృష్టిలో ఉండే మంచివాటినీ, ఆరోగ్యకరమైన వాటినీ, సుందరమైనవాటినీ వదలిపెట్టి ఊరకే దుఃఖిస్తూ ఉంటాడు.


ఇది ఎవరి తప్పు, భగవంతునిదా, మానవునిదా?

కాని మనుష్యుల అదృష్టం కొద్దీ, భగవంతుడు అనంతదయాసాగరుడై మానవుని ఎన్నడూ వదిలిపెట్టడు.


ఎల్లప్పుడూ గురువులనూ, శాస్త్రాలనూ ఇచ్చి, కొత్త అవకాశాలను ఇచ్చి, మార్గం చూపించి తన తప్పులను తెలుసుకొనచేసి తుదకు శాశ్వతానందాన్ని ప్రసాదిస్తాడు. - (గురుచరణ సన్నిధిలో..  పుస్తకం నుంచి)


💥#గురుబోధ:


భారం ఎందుకు?


ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (ఆలోచనలు) పుట్టడానికి అవకాశం ఇవ్వకుండా, ఆత్మ నిష్ఠాపరుడై ఉండటమే తనను తాను దేవుడికి అర్పించుకోవడం. ఈశ్వరుడిపై ఎంత భారం మోపినా ఆయన దానిని భరిస్తాడు


సర్వకార్యాలను ఒక పరమేశ్వర శక్తి నడుపుతున్న కారణంగా దానికి మనం లోబడి ఉండాలి.

అంతేకానీ, ‘అలా చేయాలి, ఇలా చేయాలి’ అని ప్రణాళికలు వేయడం దేనికి?


రైలుబండి ప్రయాణికులతోపాటు వారి సామాన్లన్నీ మోస్తుందని తెలుసు. అయినా, మన సంచి ఓ మూలన ఉంచి హాయిగా ప్రయాణించకుండా.. దానిని మన నెత్తికి ఎత్తుకొని ఈసురోమనడం ఎందుకు?


💥#జ‌యాప‌జ‌యాల‌పై ర‌మ‌ణ మ‌హ‌ర్షి చెప్పిన నీతివాక్యం!!


పనిలో విజయం లభించినప్పుడు ‘అంతా నా గొప్పదనమే’ అని పొంగిపోకు. ‘దేవుని దయ’ అని కృతజ్ఞతతో ఉండు.


అలాగే, పని సఫలం కానప్పుడు అది పనితీరు అనుకోక, కార్యాల జయాపజయాలు మానవ ప్రయత్నంతో కాక, దైవానుగ్రహంతో లభిస్తాయని గ్రహించు. 


జయాపజయాలు విధివిలాసం. అంతేగాని, సంకల్ప శక్తి ఉండటమో, లేకపోవడమో కాదు.

అన్ని వేళలా సమతాబుద్ధిని సాధించడమే సంకల్ప సిద్ధి. దాని విజయం కూడా!


సాధకుడు తోటివారి ఆదరణ, సానుభూతులకు పాత్రుడు అవుతూ ప్రపంచంలో ఉండాలి. ఇతరుల అసూయాద్వేషాలకు కాదు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥