💥ఉగ్ర నారసింహుని అవతారతత్త్వం!
⚜️🕉️🚩ఓం లక్ష్మీనృశింహాయ నమః🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥ఉగ్ర నారసింహుని అవతారతత్త్వం!
రామకృష్ణాది అవతారముల వలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారం శ్రీ నరసింహుడు.
నారసింహుని పూజలతో, అకాల మృత్యు భయం ఉం.డదని, దుష్టగ్రహ బాధలు, పైశాచిక చేతబడుల ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి నారసింహ మంత్రానికి గలదని భక్తుల, సాంప్రదాయాచరణాసక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం
పగలు రాత్రి కాని సంధ్యా సమయాన,
నరుడు జంతువు కాని రూపంతో,
భూమ్యాకాశాలు కాని తొడలపై,
సజీవము నిర్జీవమూ కాని చేతి గోళ్ళతో, హరణ్య కశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, అంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అవతారాలకు భిన్నమైనది.
దుష్టశిక్షణ శిక్ష రక్షణ సర్వాంతర్యామిత్వం, భక్తుని మాటను నిజం చేయడం... నమ్మినబంటును శాప విముక్తుని గావించడం,
ఎన్ని నియంత్రణలు, వరాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వైరి కోరుకున్న విధంగానే శతృవధ చేయడం, సూక్ష్మం నుండి స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం నరసింహావతారంలో విశిష్టతలు.
💥విష్ణుసేవా తత్పరులైన జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు.
ఒకసారి సనక సనందాది మహా మునులు వైకుంఠుని దర్శనార్ధం వెళ్ళగా, అది తగిన సమయం కాదని, జయవిజయులు అడ్డగించగా,
మునులు కోపించి వారిని విష్ణు లోకానికి దూరం కాగలరని శపించారు.
అప్పుడు వారు విష్ణువు శరణు వేడగా, మునుల శాపానికి తిరుగు లేదని చెప్పారు.
కాని వారిలోని భక్తిని తెలిసిన మహావిష్ణువు వారికి ఒక ఉపాయాన్ని చెప్పారు.
అదేమిటంటే భక్తులుగా 7 జన్మ లు, లేదా విరోధులుగా 3 జన్మలు భూలోకాన ఉంటే మునులు ఇచ్చిన శాపాన్ని అనుభవించినట్లు అవుతుంది.
అటు ముని జనానికి వచ్చిన కోపం ఉపశమిస్తుం ది. ఇటు మీరు కోరుకున్నట్టు తిరిగి నా దగ్గరకు వచ్చే మార్గం మీకు సులువు అవుతుందని చెప్పాడు.
జయ విజయులు ఏడు జన్మలు తమను విడిచి దూరంగా ఉండలేమని వైరంతోనే 3 జన్మలు ఎత్తి త్వరగా మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది.. కనుక ఈ మూడు జన్మలే మాకు అంగీకారమని చెప్పారు.
వారే కృతయుగంలో హరణ్యాక్ష హరణ్యకశిపులుగా,
త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా,
ద్వాపరలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు.
💥రాక్షసరాజు హరణ్యకశిపుడు తపస్సుకై వెళ్ళగా, ఆయన భార్య లీలాదేవి గర్భవతిగా ఉండగా, ఇంద్రుడు రాక్షస సంహారాన్ని ప్రారంభించి, చివరకు లీలావతిని అపహరించుకొని పోబోతుండగా...
నారదుడు మందలించి, తన ఆశ్రమానికి తీసుకెళ్ళి, భాగవత తత్వబోధ చేయగా, గర్భస్థుడైన ప్రహ్లాదుడు విన్నాడు.
తపస్సుచే బ్రహ్మను మెప్పించిన హరణ్యకశిపుడు తనకు నరులచేగాని, మృగాలచేగాని, పగలు గాని, రాత్రి గాని, ప్రాణమున్న వానిచే గాని, ప్రాణము లేని వానిచే గాని, ఆయుధము చేత గాని, గాలిలో గాని, నీటిలోగాని, అగ్నియందు గాని, ఆకాశంలో గాని, భువి పైన గాని, దేవదానవులచే గాని, ఇంటగాని, బయట గాని మరణము లేకుండా వరాలు కోరి, పొందాడు.
పుట్టిన బిడ్డకు ‘ప్రహ్లాదుడు’ అని నామకరణం చేశాడు. హరణ్య కశిపుడు వరగర్వ మదాంధుడై, విష్ణుద్వేషియై, దేవతలను జయించి, ఇంద్ర సింహాసనం ఆక్రమించి, తాపసులను వారి తపస్సులను భంగ పరచి, సాధువులను హంసించి, పంచభూతాలను శాసించాడు.
విష్ణుభక్తుడైన కుమారుని మార్చడానికి శతవిధాలా ప్రయత్నించాడు.
తుదకు విసిగిపోయి విష్ణువు ఎక్కడ ఉన్నాడురా అని ప్రశ్నించాడు.
కలడంబోధి గలండు గాలి గలదాకసంబునుం గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలదడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులందంటన్
గలడీశుండు కలండు తండ్రి! వేదకంగానేల నీ యా యెడన్
ఇందుగలండందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి! వింటే..
-- అంటూ ప్రహ్లాదుడు బదులిచ్చాడు.
అయితే "స్తంభమునను చూపగలవె చక్రిన్" అని ప్రశ్నిం చగా, "కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్” అన్నాడా పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు.
వెంటనే హరణ్యకశిపుడు స్థంభాన్ని చరవగా, శ్రీ నృసింహుడు ఆవిర్భవించి, హరణ్యకశిపుని ఒడిసి పట్టి, వజ్రాల వంటి, ప్రాణం ఉన్నవీ లేనివీ అయిన తన నఖాలతో (గోళ్ళు) చీల్చి, శ్రీహరి (మనిషి జంతువు కాని) నరసింహ రూపంలో, పగలూ రాత్రి గాని సంధ్యా సమయంలో, ఇంటా బయటా గాని గుమ్మంలో, భూమ్యాకాశాలు కాని తన తొడపై, సంహరించాడు.
ఇలా ప్రహ్లాదుని మాటను యధార్ధం చేసి, బ్రహ్మవరాన్ని గౌరవించి, తన అవతార తత్వాన్ని చాటాడు శ్రీ మహా విష్ణువు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment