💥శ్రీరామనామ మహిమ:💥
⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥జపము అనగా..
శ్లో// జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః/
తస్మాజ్జప ఇతి ప్రోక్తో జన్మ పాపవినాశకః //
‘జ’ కారము జన్మ నాశనమును (మోక్షమును),
‘ప’ కారము పాప నాశనమును సూచించును.
అనగా పాపములను నాశనము చేసి, మరల జనన మరణములు లేకుండా మోక్ష మొసంగునట్టిది గనుకనే
"జపం" అని చెప్పబడినది.
శ్లో// ప్రణవో థనుః శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్య ముచ్యతే/
అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్//
భగవన్నామమైన ‘ఓం’ కారము ధనుస్సు.
ఆత్మయైన సాధకుడే బాణము.
బ్రహ్మమును చేరుటే అతని లక్ష్యము.
సాధకుడు అటువంటి ఓం కారము అనెడి థనస్సును ఊతము చేసుకుని, నిశ్చలమైన మనస్సుతో బ్రహ్మమును గురి చూసి కొట్టిన యెడల ఆత్మ బ్రహ్మము నందు జేరి తానే బ్రహ్మ స్వరూపుడగుచున్నాడు.
💥జపానికి ఇంతటి శక్తి ఉంటే!
ఇక "శ్రీరామ" నామ జపానికి ఎంతటి శక్తి ఉన్నదో చెప్పుట మానవమాత్రుల వలన సాధ్యమా!?
💥శ్రీరామనామ మహిమ:💥
శ్లో// గాణాపత్యేషు శైవేషు శాక్త సౌరేష్వభీష్టశః
వైష్ణవేష్వపి సర్వేషు రామ మంత్రః ఫలాదికః//
#తాత్పర్యము:
గణేశ, శైవ, శక్తి, సూర్య, వైష్ణవ మంత్రములన్నింటి కంటెనూ అధిక ఫలము ఈ రామ నామ జపము వలన కలుగుతుంది.
రామ నామము జపించుచుండుట వలన గాని, ఈ రామ నామమునే మరణాసన్నులైన వారి కుడి చెవిలో ఉపదేశించుట వలన గానీ, ఎవరయినను మోక్షము బొందెదరని శ్రీరాముడు శివునకు ఉపదేశించెనట.
"ర" అగ్ని బీజం - దహింప జేయునది,
"ఆ" వాయు బీజం - సర్వగతము, ఆకర్షకము,
"మ" ఆకాశ బీజం - శతృ మోహన కరము
ఇటువంటి అగ్ని బీజ, వాయుబీజ, ఆకాశ బీజ సమ్మిళితమైన "శ్రీరామ" నామ మహిమ ఇంతా అంతా అని చెప్పనలవి కాదు.
శ్లో// చిద్వాచకో ర కారస్స్యాత్ సద్వాచ్యో2కార ఉద్యతే/
మకారానంద వాచస్స్యాత్ సచ్చిదానంద మవ్యయమ్//
"ర" కారము చిత్తు, "ఆ" కారము సత్తు, "మ" కారము ఆనందము. వీటి సంయోగముచే నాశరహితమైన "సచ్చిదానంద" రూపమే "శ్రీరామ" నామము.
అలాగే "ర" కారము వైరాగ్యమునకు హేతువు, "ఆ" కారము ఙ్ఞాన కారణము,"మ" కారము భక్తికి కారణము కనుక నిత్యము రామనామమను జపించు వారలకు భక్తి, ఙ్ఞాన, వైరాగ్యములు కలుగును.
శ్లో// "తర్జనం యమ దూతానాం రామ నామేతి గర్జనం//"
‘రామ రామ ’ అని క్షణ క్షణము జపించుచుండుట వలన యమ దూతలు దరికి జేరుటకు కూడా భయపడి దూరముగా పారిపోవుదురు.
శ్లో// అఙ్ఞానాదధ వాఙ్ఞానా దుత్తమ శ్లోక నామయత్/
సంకీర్తిత మఘం పుంసోదహేత్యేవ యథానలః //
ప్రజ్వరిల్లెడి అగ్ని కట్టెలను కాల్చు చందమున, భగవన్నామ శక్తి తెలిసి కాని, తెలియక కాని ఏవిధంగా చేసినా మానవుల యొక్క పాపములను దహించి వేయును.
కనుక అటువంటి ‘రామ’ నామజపాన్ని మనము చేయుట వలన జన్మ జన్మాంతరములలో చేసిన పాపములన్నీ నాశనమొంది..
ఇహమున సమస్త సంపదలూ పొందటమే కాక, పరమున మోక్ష ప్రాప్తిని పొందుదురు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment