💥అనంతం.. అద్భుతం.. దుర్వాంకురం.
⚜️🕉️🚩ఓం మహాగణపతయే నమః🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
పదహారు నామాలు ఉన్నవాడు..
ముప్పైరెండు రూపాల వాడు..
అరవైనాలుగు కళల్లో ఆరితేరిన రేడు... వినాయకుడు.
వికట రూపంతో అందరినీ అలరిస్తాడు.
యోగ గణపతిగా సాధకుల తోడు నిలుస్తాడు.
ఉచ్ఛిష్ట మూర్తిగా కష్టాలను హరిస్తాడు.
సంకష్ట మూర్తిగా సంకటాలను దూరం చేస్తాడు.
ఘంటం పట్టి భారతం రాసిందీ ఆయనే!
ఉద్దండ రూపంతో దుష్టశక్తుల భరతం పట్టేదీ ఆతడే!!
గిరితనయ గారాలపట్టిగా.. కరిరాజ ముఖునిగా.. తొలిపూజలు అందుకుంటున్న మహాగణపతిని మనసారా స్మరించుకుందాం.
కొండంత దైవం గురించి గోరంత తెలుసుకుందాం.
💥అనంతం.. అద్భుతం.. దుర్వాంకురం.
దుర్వాంకురం అంటే ‘గరిక’.
గణపతికి గరిక అంటే ప్రీతి. దాని మహిమ గురించి తెలుసుకుందాం.
మిథిలానగరంలో విరోచనుడు, సులోచన దంపతులు ఉండేవారు. వీరు గణేశుని భక్తులు.
ఒకసారి గణేశుడు వీరి భక్తికి మెచ్చి, వారింటికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో వెళ్ళాడు.
వారు చాలా బీదవారు. కూర్చోడానికి కుర్చీ కాని, మరే ఆసనమైనా లేని వాళ్ళు.. ఇంట్లో ఒక మూల గణపతి ప్రతిమను ఉంచి పూజిస్తున్నారు.
ఆ పరిస్థితిలో వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో వచ్చిన గణపతి "ఓ! పుణ్య దంపతులారా! నేనొక బీద బ్రాహ్మణుడను. నాకు ఆకలిగా ఉంది. ఆహారం కోసం తిరుగుతూ మీ ఇంటికొచ్చాను. నాకు కడుపునిండా ఆహారాన్ని పెట్టమనగానే, ఆ దంపతులు ఆశ్చర్యంతో, బేలగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే..
గణపతి తొందర పెడితే "స్వామి! మేము చాలా కడు బీదవారం. మేము ఎవ్వరినీ యాచించక, యాదృచ్ఛికంగా వచ్చిన దానితోనే జీవిస్తున్నాం. ఈ రోజు పూజ పూర్తి అయిన తరువాత మిగిలిన రెండు గరికలు మా త్రమే ఉన్నాయి" అనగానే..
అవే పెట్టమని వృద్ధ బ్రాహ్మణుడు అనగానే, వారు ఆ గరికలను (దుర్వాంకురాలు) ఒక ప్లేటులో పెట్టి ఆయన ముందుంచారు.
ఆ విప్రుడు ఆ గరికలను తీసుకుని, మాయా రూపం వదిలేసి, నిజ దర్శనం చేసాడు.
అపుడా దంపతులు స్తుతించారు.
గణపతి "మీ భక్తికి మెచ్చాను. మీకున్నా లేక పోయినా, తిన్నా, తినకపోయినా నా పూజ మాత్రం మానలేదు. మీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు"
అపుడా దంపతులు "స్వామి! మాకు ఈ ఘోర సంసార బాధల నుండి ముక్తిని ప్రసాదించమని కోరగా, ఇకనుండి మీకు ఆర్థిక కష్టాలు ఉండవు. నిశ్చింతగా కొంత కాలమైన తదుపరి, ముక్తి కలుగుతుంది" అని చెప్పి అంతర్థానం అయ్యారు గణపతి.
తరువాత చూస్తే, వీరు పూజ చేసిన దుర్వాంకురాలన్నీ బంగారం అవ్వడంతో వారి సంతోషానికి అవధులు లేవు.
💥ఒకసారి కౌండిన్య మహర్షిని ఆయన భార్య "నాథా! మనం గణపతి పూజలో గరిక (దుర్వాంకురాలు) వాడతాము. దాని మహిమ గురించి తెలపండి” అని కోరగా..
"ఆశ్రయా! నువ్వు ఒక గరికను తీసుకుని సరాసరి స్వర్గానికి వెళ్ళి గరిక ఎత్తు బంగారం ఇవ్వమన్నానని అర్థించు” అనగానే,
ఆమె సరాసరి ఇంద్రుడు వద్దకు వెళ్ళి భర్త చెప్పిన విషయము చెప్పి, తాను తెచ్చిన గరికను ఆయన ముందుంచింది.
ఇంద్రుడు ”అమ్మా! కౌండిన్య మహర్షి కోరినట్లుగానే గరిక ఎత్తు బంగారం ఇస్తానని చెప్పి, దూతను రమ్మనమనగా ఆ దూతను ఇచ్చి, కౌండిన్య మహర్షి భార్య ఆశ్రయాదేవిని కుబేరుడు వద్ధకు పంపి తాను ఇమ్మనట్లుగా బంగారం ఇప్పించు అని పంపాడు.
కుబేరుడు బాగా ఆలోచించి "మహర్షి గరిక ఎత్తు బంగారం కోరడమేమిటి? అని ఆలోచిస్తూనే త్రాసులో ఒక ప్రక్క దుర్వాంకురాన్ని, మరోప్రక్క బంగారాన్ని ఉంచాడు.
గరికే బరువుగా ఉంది. కుబేరుడు క్రమ క్రమంగా తన సంపదనంతా త్రాసులో పెట్టినా, సరితూగలేదు. కుబేరుడు ఇంద్రుడుకి ఈవిషయాన్ని తెలిపాడు.
ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయి, తన సంపదంతా పెట్టినా, గరికతో సరితూగ లేదు. వారికి ఏమి చేయాలో అర్థం కాక, కౌండిన్య మహర్షి భార్య ఆశ్రయాదేవిని తీసుకుని కుబేరుడు, ఇంద్రుడు మహర్షి ఆశ్రమానికి వచ్చారు.
"మహర్షీ! మీరు పంపిన ఈ దుర్వాంకురం సామాన్యమైంది కాదు. దీనిలోని విశిష్టత తెలుపమని కోరగా..
"ఇది గణపతిని పూజించిన దుర్వాంకురం. అనంతమైంది. అద్భుతమైనది. గణేశునకు ప్రీతి పాత్రమైనది. అందుకే లోకానికి ఈ గరిక మహాత్యం తెలియడానికి ఇలా చేసాను" అని చెప్పాడు.
ఈ దుర్వాంకురం మహిమ విన్నా, చదివినా, అనంతమైన పుణ్యం సిద్ధిస్తుంది అని "గణేశ పురాణం" వివరిస్తోంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment