💥నర నారాయణులు💥🙏
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ!
పీతాంబర పరిధాన సురకళ్యాణనిధాన నారాయణ!!
💥నర నారాయణులు💥🙏
నరనారాయణ జననం లోక కళ్యాణ కారకం.
మానవబ్రతుకు వేదమయిన భగవద్గీతకు మూలం కూడా వారే.
జీవ బ్రహ్మైక్యతలకు నిలువెత్తు సాక్ష్యం.
విశ్వగురుడు పరమాత్మ. విశ్వ విద్యార్థి పరమాత్మే.
వారే జీవాత్మలు కూడా.
నర నారాయణుల కలయికయే ఒక అద్భుత సృష్టి.
మాధవునితోనే మానవుడు. మానవునిలోనే మాధవుడు.
నిజం తెలిస్తే సర్వం బ్రహ్మమయం.
🍁🍁🍁🍁🍁
💥నరనారాయణుల వేల సంవత్సరాల తపస్సునకు ఒక లక్ష్యం ఉంది. అదే "సహస్ర కవచుని" సంహారం.
సహస్ర కవచుడు ఒక రాక్షసుడు.
పుట్టుకతోనే వేయి కవచములను శరీరంలో కలిగి యున్నాడు.
వానితో పోరు సలపాలంటే వేయి సంవత్సరాల తపోబలం కావాలి.
వాడి సంహారం కానట్లయితే దివిజులకు, మానవులకు, మహర్షులకు కంటకమవుతుంది.
ధర్మం నశిస్తుంది. జన జీవన విధానానికి విఘాతం ఏర్పడుతుంది.
అందుకే నర నారాయణులుగా వైష్ణవతేజం ఆవిర్భవించింది.
నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడు, నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడు ఇలా సహస్ర కవచునితో తలపడ్డారు.
ఒక్కొక్కమారు ఒక్కో కవచం చొప్పున నర నారాయణులు ఆ రాక్షసుని 999 కవచాలు ఛేదించారు.
ఇంక ఒక్క కవచం మాత్రమే ఉంది.
కాని వాడు ఆ కవచంతోనే తన జన్మను చాలించాడు.
వాని ఆత్మ మాత్రం రాక్షస భావంతో రగిలిపోతూ మరలా జన్మించాడు. అతడే #కర్ణుడు.
💥పుట్టుకతోనే కవచ కుండలాలతో జన్మించిన మహావీరుడు. అలాగే నర నారాయణులు మరలా వాని సంహారం కోసమే కృష్ణార్జునులుగా జన్మించారు.
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం మహాయుద్ధంలో ఒకరు రథి (వీరుడు) మరొకరు సారథిగానై ధర్మయుద్ధం నిర్వహించారు.
కృష్ణుడు మాయోపాయం పన్ని ఇంద్రుని బ్రాహ్మణ రూపంలో పంపి, దానకర్ణుడైన ఆ సహస్రకవచుని కవచకుండలాలను స్వీకరించడంతో కర్ణుని ఓటమి, కర్ణుని శక్తి సామర్థ్యాలు నిర్దేశించబడ్డాయి.
నరుడైన అర్జునుని చేతిలో కర్ణుడు వీరమరణాన్ని పొందడం జరిగింది.
మానవునిగా భువికి వచ్చినవారు దివ్యులైననూ మానవాతీతమైన శక్తి సామర్థ్యాల సాధనకు ప్రయత్నం చేయాల్సిందే. అందుకే వేల సంవత్సరాల తపోబలం సాధించడం.
అలాగే కర్ణుని కవచ కుండలాలను అపహరించడానికి ఇంద్రుణ్ణి మాయా బ్రాహ్మణునిగా పంపడం.. ఇదంతా విధిలీల.
జగత్తునకు, జగత్తులో జీవించే ప్రాణులకు హితం కలగాలి. సనాతన వైదిక ధర్మం నిరాటంకంగా కొనసాగాలి.
అందుకు పరమాత్మ ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు.
ఎన్ని ఎత్తులకైనా తెరదీస్తాడు.
అందుకు నిదర్శనమే నర నారాయణ జననం.
నిజానికి కర్ణుడు దానశీలుడు, శౌర్యవంతుడే కాని అతడు అనుసరించిన సేవాధర్మం రాక్షస ప్రవృత్తికి, అధర్మవర్తనకు బలాన్ని సమకూర్చుతోంది.
💥చివరి క్షణాలలో కర్ణుడు అర్జునునితో...
"అర్జునా! ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మం మనల్ని కాపాడుతుందంటారు. మేము కూడా నిరంతరం యథాశక్తి, యథాశ్రుతం ధర్మాన్నే అనుసరించాం. కాని ఆ ధర్మం తన భక్తులమైన మమ్ము రక్షింపజాలకున్నది" అంటూ ఎదురైన శాపాలకు తాపం చెందుతూ కొద్దిసేపు యుద్ధం ఆపుమని కోరుతూ చెప్తాడు.
అప్పుడు పరమాత్మ "కర్ణా! ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చిందా? లాక్షా గృహదహనం, ద్రౌపదీ వస్త్రాపహరణం, బాలుడైన అభిమన్యుని వధ మొదలైన సన్నివేశాలలో ధర్మాధర్మ విచక్షణ లేదే" అంటూ..
"నీచులు కష్టాలలో దైవ నింద చేస్తారు కాని, తాము గతంలో చేసిన దుష్కృతాల వలననే దుష్పలితాలను పొందుతున్నామని భావించరు" అని తెలియజెప్పి, నరుని ప్రోత్సహించగా, అర్జునుని అస్త్రాలకు కర్ణుడు వీర మరణం పొందడం జరిగింది.
ఆవేశం, ఆలోచనా రాహిత్యం , అహంకారం, కామ క్రోధాదులు రాక్షస ప్రవృత్తికి సంకేతం.
మనం చేసే లోభం, పాపం శాపాలై మానుష ప్రయత్నాన్ని పతనం చేస్తాయి. శేషకవచంతో కర్ణునిగా జన్మించిన సహస్ర కవచుడు అలాంటి శాపాల తాపాలకు గురియైనాడు.
నరనారాయణులు, వరం తీసుకొన్న కుంతి, కవచకుండలాలు గ్రహించిన ఇంద్రుడు, అనుచితాలతో నిరుత్సాహ పరచిన శల్యుడు, భూమాత శాపం మొదలగు ఆరుగురి వలన కర్ణుడు మరణించాడని చెప్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment