🕉️🔱 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 🌹గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని🌹🙏 ⚜️🚩 భవాని అష్టకం 🌺🙏 (భావ సహితం) న తాతో న మాతా న బంధుర్ న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా | న జాయా న విద్యా న వృత్తిర్ మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 1 || 🌹భావం: అమ్మా ! ఓ భవానీ ! నాకు తల్లిగానీ, తండ్రిగాని, కొడుకు గాని, కూతురు గాని, యజమాని గాని, సేవకుడు గాని, బంధువు గాని, భార్య గాని, విద్య గాని, వృత్తిగాని ఏదియు లేదు. కేవలం నీవే నాకు దిక్కు. నాకు దిక్కు. భవాబ్ధావపారే మహాదుఃఖ భీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః | కుసంసారపాశ ప్రబద్ధః సదాహమ్ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 2 || 🌹భావం: అమ్మా! భవానీ! కామంధుడనై, లోభినై, మత్తుడనై, జన్మపాశ బద్ధుడనై భరించలేని దుఖ్ఖముతో మిక్కిలి భయాన్వితుడనై, సంసార సాగరమున మునిగి పోయాను. కేవలం నీవే నాకు దిక్కు. నాకు దిక్కు. న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రమ్ | న జానామి పూజాం న చ న్యాసయోగమ్ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 3 || 🌹భావం: అమ్మా ! భవానీ ! ధనము, ధాన్యము మంత్రము, యంత్రము, పూజ, పునస్కారము, న్...