⚜️🚩శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం🌹

 🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


⚜️🚩కలియుగ రక్షణార్థం క్రతువు:


🌹ఒక్కప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు.

యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి,

ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు,

యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే,

నారదుని సలహామేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెడతారు.

అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.


⚜️🚩సత్యలోకం 


మహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, చతుర్వేదఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు.

చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు.

తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు.


⚜️🚩కైలాసం


🌹బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు.

శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు.

వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి, శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు.


⚜️🚩వైకుంఠం


🌹శివలోకం నుంచి నారాయణలోకం వెళతాడు భృగువు.

ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు.

ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు,

లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్ధలాన్ని తన కాలితో తన్నుతాడు.

అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి

"ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు, క్షమించండి.

నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు.

అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు.

మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు.

విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు.

                  🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️


⚜️🚩శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం🌹


ఓం శిరసివజ్ర కిరీటం - వదనే శశివర్ణ ప్రకాశం


ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణే వజ్ర కుండల శోభితం


నాసికాయాం సువాసిక పుష్పాదళం - నయనే శశిమండల ప్రకాశం


కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం


కరే కరుణాభయసాగరం -  భుజేశంఖ చక్రగదాధరం


స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం - సర్వాంగే స్వర్ణపీతాంబరం ధరం


పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం  


సర్వం స్వర్ణమయం - నామ పావనం శ్రీ వేంకటేశం


శ్రీనివాసం - తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం !!


🌹ఈ దివ్య స్తోత్రాన్ని స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు అందరూ చదవాలి.

ప్రతిరోజూ  18 సార్లు వరుసగా చదివి కర్పూర హారతి ఇస్తే శ్రీ వారి దివ్య మంగళమూర్తి దర్శనమవుతుంది.

                              ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు