పరమేశ్వరుడు భోళాశంకరుడు🌹🙏 గుణనిధి కథ

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏


⚜️🚩పరమేశ్వరుడు భోళాశంకరుడు🌹🙏

గుక్కెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు సంతోషపడతాడు.

మారేడు దళాలతో అర్చిస్తే సంతృప్తి పడతాడు.

మోక్షాన్ని ప్రసాదించి కైవల్యపదమిస్తాడు.

ఇందుకు గుణనిధి కథే ఉదాహరణ.

పూర్వం గుణనిధి అనే ఒక దుర్వ్యసనపరుడు ఉండేవాడు.

దొంగతనం అతని వృత్తి.

ఒక మహాశివరాత్రి రోజు శివాలయంలోనే దొంగతానికి వెళతాడు.

శివనామ సంకీర్తనలతో ఆలయం మారుమోగుతుంటుంది.

భక్తలంతా వెళ్లాక వచ్చిన పని కానిద్దామనుకుని శివలింగం వెనుక దాక్కుంటాడు.

కొండెక్కుతున్న దీపం వత్తిని ఎగదోసి, తన ఉత్దరీయపు పోగుల్ని తెంచి దానికి జత చేసి ఆవు నెయ్యి పోసి దీప ప్రజ్వలనం కావిస్తాడు.

ఎప్పుడేమవుతుందోనన్న భయంతో తెల్లవార్లూ మేలుకుని వుంటాడు.

పూర్తిగా తెల్లవారాక తలారి బాణం దెబ్బకు కన్నుమూస్తాడు.

బతుకున్నన్నాళ్లు దుశ్శీలుడిగా దుర్మార్గుడిగా నడిచినా, ఆ శివరాత్రి నాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగారం తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్యకృత ఫలితంగా మరుజన్మలో కళింగ రాజు అరిందముడికి పుత్రుడై జన్మిస్తాడు.

దముడనే పేరుతో మహారాజవుతాడు.

తన రాజ్యంలోని శివాలయ్యాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయిస్తాడు.

ఆపై కుబేరుడిగా జన్మించి, ఉత్తర దిక్పాలకుడై శివుడి ప్రాణసఖుడవుతాడు. 


⚜️🚩 శివ దర్శనం కూడా ఆషామాషీగా నంది వెనుక నిలబడి చేయకూడదు.

నందీశ్వరుడి కుడిచెవి దగ్గర మీ ముఖాన్ని వంచి

ఎడమ చేతి చూపుడు బొటన వేళ్లతో నందీశ్వరుని చెవులపై అర్ధవృత్తంతో వుంచి

కుడి చేతిని నందీశ్వరుని వాల భాగంలో అర చేయి మొత్తం ఆనేలా వుంచి

నంది కుడి చెవిలో మూడుసార్లు, నందికేశా శివదర్శనం కోరుతున్నాను అనుగ్రహించు స్వామి అని చెబుతూ

ఎడమ చేతి అర్ధవృత్తంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశం నుంచి శివలింగాన్ని దర్శించాలి.


⚜️🚩రుద్రాక్ష వేసుకోవడం అంటే "నేను కూడా నా భావనల చేత నా కర్మల చేత నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేయుచున్నాను” అని అర్థం.

ఈ భావన ఏర్పడిందంటే

♦️యద్యత్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం♦️

మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలే...

అటువంటి భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు.


⚜️🚩శివుడికి మారేడు దళంతో పూజ చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.

"బాల్యం, యౌవనం, కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు" అని ఆశీర్వదిస్తాడు.

కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. 


⚜️🚩మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.

అందులో మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం.

రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట.

మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.

ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.

🌹సేకరణ

               🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |

త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ||🌹🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం