మైందుడు హనుమత్ భక్తుడు కథ

 🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏


⚜️🚩 శ్రీ హనుమంతుని రెండవ అవతారం

         "వీరాంజనేయస్వామి" ధ్యానం -


♦️"చింతి తార్థ ప్రదం దేవం - శాన్తాకారం మహాప్రభుమ్

సంతతం చింతయేత్ చిత్తే - హనూమన్త మనూపమమ్ ||

మనోజవం మారుతతుల్యవేగం - జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం వానర యూధముఖ్యం - శ్రీరామదూతం

శిరసానమామి ||♦️


⚜️🚩మైందుడు హనుమత్ భక్తుడు.

నిత్యం హనుమత్ మంత్రం జపిస్తూ, నిష్టగా జీవించే వాడు.

మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు.


🌹మైందుడుకి  కాశీ వెళ్లి శ్రీ విశ్వనాదుడిని దర్శించాలనీ, గంగా స్నానంతో పులకించాలని అనిపించింది.

చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు.

గంగా నదికి దక్షిణ తీరం చేరాడు.

ఆ నదీమ తల్లికి భక్తీతో నమస్కరించాడు.

నది నిండుగా ప్రవహిస్తోంది.

దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు.

కొంతసేపటికి నదిలో కి ఒక పడవ వచ్చింది.

దానిని ఎక్కాడు.

పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది.

తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు.

నీరు దాని ద్వారా పడవ లోకి చేరుతోంది.

పడవ బరువెక్కి, మునిగి పోవటానికి సిద్ధంగా వుంది.

భయం వేసిన మైందుడు తల మీద వస్త్రాన్ని కప్పుకోని

భక్తీ తో "హనుమత్ మంత్రాన్ని”  పఠిస్తున్నాడు.


🌹హనుమ దీనిని గమనించి, తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక ”వానర" రూపం ధరించి,

ఆ పడవను నెత్తిన పెట్టుకోని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్లి, అక్కడ మనుష్యులంతా చూస్తుండగా అదృశ్యమైనాడు.

దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు.

భక్తీతో ఆ కోతికి నమస్కరించారు.


🌹పడవలో నిశ్చల జపంలో వున్న  మైందుడుకి ఇదేమీ తెలీదు.

తెల్లవారి లేచి చూసే సరికి గంగ ఒడ్డున పడవ వుండటం చూసి ఆశ్చర్యపడ్డాడు.

పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరిందో తెలీలేదు.

అప్పుడు ఒడ్డున వున్న ఒక మనిషి ఒక మహా వానరం ఈ పడవను తలమీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్లి పోయిందని చెప్పాడు.


🌹మైందుడుకి ఆశ్చర్యం వేసి ”మీరు పుణ్యాత్ములు వానర రూపంలో హనుమను దర్శించారు.

జపం చేస్తూ నేను ఏదీ గమనించ లేక పోయాను.

నేను అదృష్ట హీనుడిని.

హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగపాలు చేస్తాను” అని చెప్పి గంగా నదిలోకి దూక టానికి సిద్ధ మైనాడు.


🌹అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యం తో నిజ రూపంతో మైందుడుకి దర్శనం ఇచ్చాడు.

హర్ష పులకితుడై మైందుడు హనుమను స్తుతించాడు.


♦️“ఉష్టారూఢ! సువర్చలా సహచరన్ సుగ్రీవ మి త్రాంజనా

సూనో! వాయుకుమార! కేసరి తనూజాక్షాది దైత్యాంతక!

సీతాశోక హరాగ్నినందన! సుమిత్రా సంభవ ప్రాణద!

శ్రీ భీమాగ్రజ! శంభుపుత్ర! హనుమన్| పంచాస్య!

తుభ్యంనమః"♦️


🌹అని చేసిన స్తోత్రానికి ఆనంద పరవశుడై హనుమ "భక్తా! మైందా! భక్త సంరక్షణ కొరకై  నేనెప్పుడూ భక్తుల వద్ద వసిస్తూనే వుంటాను.

నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు.

నీ దగ్గరే నేను ఉంటాను.

జీవితాంతంలో నన్ను పొందుతావు”

అని వరం ఇచ్చి అదృశ్యం అయాడు.

అలాగే మైందుడు భక్తీ తో జీవించి, సుఖాలు పొంది చివరికి హనుమత్ మంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు. 

                             ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు