వాలఖిల్యులు 🕉️🙏

 🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


⚜️🚩వాలఖిల్యులు 🕉️🙏


🌹వాలఖిల్యులు నవబ్రహ్మలలో ఒకరయిన క్రతువు, 

దేవహుతి, కర్ధముల పుత్రిక అయిన క్రియ కు కలిగిన సంతానమే 60,000 మంది వాలఖిల్యులు.


🌹వీరు బొటన వేలు పరిమాణంలో ఉండి నిరంతరం తపస్సులో ఉంటారు. 


🌹వారి తపస్సు అత్యంత కఠినమయినది.

వారు చెట్టు కొమ్మలకు తలక్రిందులుగా వ్రేళ్ళాడుతూ తపస్సు చేస్తారు.


🌹కశ్యప ప్రజాపతి పుత్రుల కోసం పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు వీరిని ఆహ్వానించారు. 


🌹వెళ్లే వారు అందరూ  మోయగలిగినంత యాగంలో ఉపయోగించుటకు వీలు అయిన వస్తువులు, కర్రపుల్లలు వంటివి తీసుకు రావటం పరిపాటి కనుక వీరు తాము మోయగలిగిన గడ్డి పరకలు తీసుకు వచ్చారు.


🌹వారిని చూసి ఆ సమయంలో అక్కడ ఉన్న ఇంద్రుడు వెక్కిరింతగా నవ్వాడు.


🌹అలా నవ్విన ఇంద్రుని చూసిన వాలఖిల్యులు అత్యంత బలవంతుడు, అనితర సాధ్యుడు ఈ ఇంద్రుని కంటే వంద రెట్లు బలం కలిగిన వాడు అయిన మరో ఇంద్రుడు ఈ యాగ ఫలముగా పుట్టుగాక అని అన్నారు.


🌹ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు.

ఆ మాటలు విన్న కశ్యపుడు ఇది వరకు బ్రహ్మచే నియమించబడిన ఇంద్రుని కాదనుట సరి కాదు అని,

తనకు కలగబోయే సంతానం పక్షిగా,

ఆ పక్షులలో ఇంద్రునిగా ఉంటుంది అని వాలఖిల్యులను కోరాడు.

దానికి అత్యంత దయగలిగిన వాలఖిల్యులు  ఒప్పుకున్నారు.


🌹కశ్యపునకు గరుడుడు జన్మించాడు.

ఆ గరుడునకు పక్ష్మీంద్రుడు అనీ పేరు.


🌹కద్రువ, వినతా వీరు కశ్యప ప్రజాపతియొక్క భార్యలు.

కద్రువ పుత్రులు సర్పములు.

వినతాదేవి యొక్క కుమారుడు గరుత్మంతుడు.


🌹క్షీరసాగరమథనం నుంచి పుట్టిన ఉచ్ఛైశ్రవమనే తెల్లని గుర్రం ఉన్నది.

దాని రంగు గురించి కద్రువ వినత పందెం వేసుకున్నారు.

ఎక్కడైనా నలుపు చూపిస్తే నీకు నేను దాసీగా ఉంటాను అన్నది వినత.

అప్పుడు కద్రువ వినతను మోసం చెయ్యాలని తన వేయిమంది సంతానాన్ని పిలిచి ఆ నల్లత్రాచులను ఉచ్ఛైశ్రవం తోకకు వ్రేళ్ళాడమని ఆజ్ఞాపించింది.

శాపం ఇస్తుందనే భయంతో వారు గుర్రంయొక్క తోకకు చుట్టుకున్నాయి.

మోసంతో వినతను దాసీగా వినియోగించింది కద్రువ.

తల్లిని అనుసరించి గరుత్మంతుడు కూడా దాస్యం చేశాడు.


🌹తన తల్లి దాస్యవిముక్తికి ఏమి చేయాలి? అని కద్రువను అడిగాడు గరుత్మంతుడు.

అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులని చేస్తాను అన్నది కద్రువ. 


🌹గజకచ్ఛపములనే భయంకరమైన శక్తులున్నాయి.

వాటిని ఆహారంగా స్వీకరించి నశింపచేయాలి అని చెప్తే తిందామని కాలుతో పట్టుకొని ఆరెంటినీ తినడానికి అనువైన స్థలంకోసం వెతుకుతుండగా అతని వేగానికి వృక్షాలన్నీ కంపించాయి.


🌹అప్పుడు అక్కడి పెద్ద మర్రిచెట్టు తన కొమ్మపై చేరి గజకచ్ఛపాలను భుజించమని కోరింది.

గరుడుడు దాని కొమ్మపై వ్రాలగానే ఆ కొమ్మ విరిగిపోయింది.


🌹ఆకొమ్మను పట్టుకొని చూడగా అధోముఖులై వ్రేలాడుతూ వాలఖిల్యులు  మహర్షులు అనేకమంది ఉన్నారు.


🌹కొమ్మను విడిచి పెడితే వారికి ప్రమాదం అని,

వారిని కాపాడాలని తలంచి ముక్కుతో కొమ్మను పట్టుకొని ఎగిరాడు.

రెండు కాళ్ళతో గజకచ్ఛపములను పట్టుకున్నాడు.

అలా వెళ్తూ వెళ్తూ హిమవత్పర్వతం వద్దకు వెళ్ళాడు. 


🌹"గరుడుడు ప్రజల క్షేమంకోరి గొప్పకార్యం చేయబోతున్నాడు.

దానిని మీరు అనుమతించండి” అని కశ్యపుని ప్రార్థనను అంగీకరించి "వాలఖిల్య మహర్షులు" చెట్టుకొమ్మను విడిచి గరుత్మంతుని దీవించి హిమవత్పర్వతానికి తపస్సుకై వెళ్ళిపోయారు.


యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్|

విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే||🌹🙏

                        ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం