🌹శ్రీ కాళహస్తీశ్వరా! 🌹🙏
🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏
🌹 హర హర మహాదేవ శంభో శంకర 🌹
♦️కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా
లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత
వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది
క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా♦️
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
ఆలోచించి చూడగ నీ నామము యముని వాకిటి తలుపును మూసివేసి బిగించునట్టి గడియ యగునది.
దుష్టుడగు యముడు తనకు ప్రమాణముగ అతని లేఖకుడు చిత్రగుప్తుడు,
ఆ చిత్రగుప్తుని నోరు అను పుట్టయందు మహా భయంకరమగు నాలుక యను సర్పము,
ఇట్టి సర్పము పాలిటి గరుడుని వంటిది నీ నామము.
మృత్యువు అను కౄర మృగపు నోటి యందలి కోరలను పర్వతమునకు వజ్రము వంటిది నీ నామము.
♦️పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే
లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం
టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా♦️
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము లెమ్మని లాలించి పిలువగా
ఆ పిల్లలు గారాబము పోవుచు "నాకు అరటి పండ్లు కూడ కావలె"నన్న వెంటనే
ఆ తల్లిదండ్రులు వాత్సల్య విశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా
మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు.
అట్లే నీవును వాత్సల్య లక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహ పర సుఖములను అనుభవింపజేయుమా.
🕉️🔱🌺🔱🕉️🔱🌺🔱🕉️

Comments
Post a Comment