⚜️🚩అర్ధనారీశ్వర స్తోత్రం🌹🙏
🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏
⚜️🚩అర్ధనారీశ్వర స్తోత్రం🌹🙏
🌹అర్ధనారీశ్వర రూపమైన శివ పార్వతులను స్తుతిస్తూ ఆదిశంకరులు ఈ స్తోత్రాన్ని రచించారు.
🌹ప్రకృతీ పురుష రూపమైన ఈ దేహాకృతిలో సున్నితమైన స్త్రీ తత్త్వానికి, దృఢమైన పురుష తత్త్వానికి ఆయా లక్షణాలను ఆపాదిస్తూ, వర్ణిస్తూ ఈ స్తోత్ర రచన జరిగింది.
చాంపేయ గౌరార్ధ శరీరకాయై
కర్పూర గౌరార్ధ శరీరకాయ |
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ || 1 ||
🌹తాత్పర్యము:
కరిగించిన బంగారము వంటి మేని ఛాయ, అందమైన జడగా అల్లబడిన జుట్టు కలిగిన దేవికి, వెలుగుతున్న కర్పూరం వంటి మేని ఛాయ, జటా ఝూటములు కలిగిన దేవునకు - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.
కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితా రజఃపుంజ విచర్చితాయ |
కృతస్మరాయై వికృత స్మరాయ
నమః శివాయై చ నమః శివాయ || 2 ||
🌹తాత్పర్యము:
చందన, కుంకుమ లేపిత శరీరము కలిగిన దేవికి, చితా భస్మలేపితమైన శరీరము కలిగిన దేవునకు, సౌందర్యముతో ప్రేమను వెదజల్లే దేవికి, మన్మథుని జంపిన దేవునకు - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.
ఝణత్ భణత్ కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమః శివాయై చ నమః శివాయ || 3 ||
🌹తాత్పర్యము:
మృదు మంజీర రావము పలికే కాలి యందెలు, బంగారు ఆభరణములు కలిగిన దేవికి, సర్పములు కాలికి యందెలుగా, దేహాభారణములుగా కలిగిన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.
విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ |
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ || 4 ||
🌹తాత్పర్యము:
నీలి కలువల వలె విశాలమైన నేత్రములు రెండు కలిగిన దేవికి, పూర్తిగా వికసించిన కలువ వంటి కనులు కలిగి త్రినేత్రుడైన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.
మందారమాలా కలితా లతాయై
కపాలమాలాంకిత కంధరాయ |
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ || 5 ||
🌹తాత్పర్యము:
మందారము మొదలగు దేవ పుష్పముల మాల, పట్టు వస్త్రములు ధరించిన దేవికి, కపాలమాల, దిక్కులే అంబరములు గా కలిగిన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.
అంబోధర శ్యామల కుంతలాయై
తటిప్రభా తామ్ర జటాధరాయ |
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ || 6 ||
🌹తాత్పర్యము:
కారు మేఘముల వంటి కురులు, గిరిరాణి అయిన దేవికి, రాగి రంగులో మెరుపులా వంటి జటా ఝూటములు కలిగిన, అన్నిటికీ ఈశ్వరుడు అయిన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.
ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ |
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమః శివాయై చ నమః శివాయ || 7 ||
🌹తాత్పర్యము:
తన నాట్యముచే ప్రపంచాన్ని సృష్టించే, జగజ్జనని అయిన దేవికి, తన నాట్యముచే ప్రపంచ నాశనము చేసే, జగత్ పితయైన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.
ప్రదీప్తరత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ |
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ || 8 ||
🌹తాత్పర్యము:
రత్నములచే పొదగబడిన చెవి ఆభరణములు కలిగిన, శివునిలో ఏకమైన దేవికి, సర్పములే సకల ఆభరణములుగా కలిగిన, శివానిలో ఏకమైన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.
🌹ఫల శృతి:
యేతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ |
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ||
🌹ఈ అష్టకాన్ని పఠనం చేసిన వారికి అసామాన్యమైన జీవనం, దీర్ఘాయుష్షు, సమస్త సౌభాగ్యాలు, సంపదలు కలుగును.
🌹ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత అర్ధనారీశ్వర స్తోత్రమ్ |
🌹ఈ స్తోత్రంలో ఉన్న 8 పద్యాల అర్థం తెలిస్తే ఏ దంపతులు విడిపోరు.
అందుకే అన్యోన్య దాంపత్యం కోరుకునే వారు అర్థనారీశ్వర స్తోత్రాన్ని చదవాలి.
దాంపత్య జీవన అర్థం.. భార్యా భర్తల బాధ్యతలు తెలుస్తాయి.
⚜️🌺⚜️🌺🕉️⚜️🌺⚜️

Comments
Post a Comment