దూర్వాగణపతి 🌹🙏
🕉️🔱🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
గజాననం భూతగణాదిసేవితం - కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం - నమామి విఘ్నేశ్వర పాద పంకజం||
🌹దూర్వాగణపతి🌹🙏
⚜️🚩పూర్వం యమధర్మరాజుకి "అనలాసురుడు" అనే కుమారుడు పుట్టాడు.
అగ్ని తత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకి ఎదురుగా వచ్చిన ప్రతిదానినీ బూడిద చేయసాగాడు.
అతని బాధ భరించలేక ముల్లోకాల్లోని జీవులన్నీ అటూఇటూ పరుగులెత్తసాగాయి.
కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుని అంతు చూసేందుకు సిద్ధపడ్డాడు.
పూర్వం తన తండ్రి అయిన శివుడు గరళాన్ని మింగిన విధంగా, వినాయకుడు కూడా ఆ అనలాసురుని అమాంతంగా మింగేశాడు.
అంతవరకూ బాగానే ఉంది.
కానీ అనలాసురునిది అగ్ని తత్వం కదా.
అందుకని అతను వినాయకునిలో విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడట.
గణేశుని తాపం తీర్చేందుకు అమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోయింది.
సాక్షాత్తూ ఆ చంద్రుడే, వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు.
అయినా ఎలాంటి ఉపశమనమూ లభించలేదు.
చివరికి తనని గరికతో కప్పివేయమని ఆ ఏకదంతుడే వారికిసూచించాడు.
అలా దేవతలంతా తలా 21గరికలను తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పాక, ఆ గరికలో ఉండే ఔషధిగుణాల వల్ల ఆయనలోని తాపం శమించిందట.
అప్పటి నుంచీ గరిక అంటే వినాయకునికి ఇష్టం ఏర్పడిందని చెబుతారు.
⚜️🚩గణేశుడు భక్త సులభుడు.
ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు.
ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసు లోని కోరికలను నెరవేరుస్తాడు.
గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను "దూర్వాగణపతి" అని కూడా పిలుస్తారు.
'దూర్వాయుగ్మమ్' అంటే గరిక అని అర్థం.
⚜️🚩మరొక కథ:
శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలు ఆడుతున్నా రు.
వారి ఆటకు న్యాయనిర్ణేతగా ఎవరుండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు.
కానీ ఆ గరికబొమ్మ ఎంతసేపూ శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి, అతడిని కుంటి వాడివి కమ్మని శపించింది.
శాపవిమోచనం కలిగించమని ఆ గరికబొమ్మ వేడుకోగా... వినాయకచవితి నాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేశుని పూజావిధానాన్ని తెలుసుకుని, ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుందంటూ శాపవిమోచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి.
అప్పటి నుంచి గరిక గణేశు ని పూజలో భాగమయ్యిందంటారు.
🌹సేకరణ
⚜️🌺🍀⚜️🌺🍀⚜️🌺🍀⚜️

Comments
Post a Comment