మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పానకాల స్వామి 🌹

 🕉️🔱🚩ఓం లక్ష్మీనృసింహాయ నమః🌹🙏


⚜️🚩శ్రీ నరసింహుడు సద్యోజాతుడు.

అంటే భక్త రక్షణార్ధం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి.

ఆపదలలో వున్న భక్తులను, వేడుకున్న వెంటనే కాపాడగల దయగల దేవుడు నరసింహస్వామి.


⚜️🚩పానకాల స్వామి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి🌹


🌹సర్వ మంగళ స్వరూపిణి, సర్వ శుభదాయిని అయిన  శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది.


🌹హిరణ్యకశిపుని వధానంతరం శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో, రౌద్రంగా, అందరికీ భీతికొల్పుతూ వున్నారు.

దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితం కనబడలేదు.

శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము  సమర్పించినది.

దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారు.

ఈయనే మంగళాద్రిపై వెలసిన "పానకాల లక్ష్మీ నరసింహస్వామి"

ఈయనకి భక్తులు కృత యుగంలో అమృతాన్ని,

త్రేతాయుగంలో ఆవునెయ్యిని,

ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు.

కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.


⚜️🚩పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది.

భక్తులు స్వామికి సమర్పించే  పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు.

పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది.

ఇంక పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు.

ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా, ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.


🌹పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో వున్న  కధ:

స్వామి పానకం తాగటం ఎంత మటుకు నిజమో పరీక్షించటానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయడు తన బావమరిది, శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీడుతో కలసి కొండపై స్వామివారి తెరిచివున్న నోట్లోకి తన కుడిచేతిని పోనిచ్చారుట.

చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందిట.

అంకినీడుగారికి తేళ్ళు, పాములు కరచినంత బాధ కలిగిందట.

వెంకటాద్రి నాయుడుగారు చెయ్యి బయటకి తియ్యగా చెయ్యి రక్త మాంసములు లేక శల్యావశిష్టంగా వుండటం చూసి విస్మయం చెందారుట.

అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి, స్వామికి తన శరీరం ఆహారమయిందని, తన జన్మ సార్ధకమయిందని ఆయన ఆలయ గోపురం నిర్మింపచేశారుట.


🌹సాధారణంగా పానకం ఉన్న చోట ఈగలు, చీమలు చేరుతాయి.

అయితే మంగళగిరిలో ఇందుకు విరుద్ధం.

ఇక పానకాల తయారి సందర్భంగా పానకం ఎంత ఒలికినా ఈగలు, చీమలు ఇక్కడ చేరవు.

కలియుగం అంతమయ్యే సమయంలో ఈ పానకాల దేవాలయం ఈగలు, చీమలు ఎక్కువ చేరిపోతాయని స్థల పురాణం చెబుతుంది.

                       ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥