⚜️🚩విష్ణు పంజర స్తోత్రం🌹🙏

 🕉️🔱🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


⚜️🚩విష్ణు పంజర స్తోత్రం🌹🙏


నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనమ్ |

ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః || 1 ||


గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభామితద్యుతే |

యామ్యాం రక్షస్వ మాం విష్ణోత్వమహం శరణం గతః || 2 ||


హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ |

ప్రతీచ్యాం రక్ష మే విష్ణో భవంతం శరణం గతః || 3 ||


శార్జమాదాయచ ధనురస్త్రం నారాయణం హరే |

నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః || 4 ||


పాంచజన్యం మహాశంఖమంతర్బోధ్యం చ పంకజమ్ |

ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞసూకర || 5 ||


చర్మ సూర్య శతం గృహ్య ఖడ్గం చంద్రమసంతథా |

నైరృత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్ || 6 ||


వైజయంతీం ప్రగృహ్యత్వం శ్రీవత్సం కంఠభూషణమ్ |

వాయవ్యాం రక్షమాం దేవ అశ్వశీర్ష నమోస్తుతే || 7 ||


వైనతేయం సమారుహ్య అంతరిక్షే జనార్దన |

మాంత్వరం రక్షాజిత్ సదా నమస్తే త్వపరాజిత || 8 ||


విశాలాక్షం సమారుహ్య రక్ష మాంత్వం రసాతలే |

ఆకూపార నమస్తుభ్యం మహామీన/మహామోహ నమోస్తుతే || 9 ||


కరశీర్సాంఘ్రిపర్వేషుతథాష్ట బాహు పంజరమ్ |

కృత్వారక్షస్వమాం దేవ నమస్తే పురుషోత్తమ || 10 ||


ఏతదుక్తం భగవతా/శంకరాయ వైష్ణవం పంజరం మహత్ |

పురా రక్షార్థమీశేన కాత్యాయన్యా ద్విజోత్తమ || 11 ||


నాశయామాస సా యత్ర దానవం మహిషాసురమ్ |

సమరం రక్తబీజం చ తథాన్యాన్ సురకంటకాన్ || 12 ||


⚜️🚩పంజరమనగా రక్షించునది అని అర్థం.

"విష్ణు పంజరస్తోత్రం" చేస్తే విష్ణువు వారి చుట్టూ ఉండి రక్షిస్తాడు.

విన్నా చాలు, స్మరించినా చాలు.


🌹ఈ విష్ణు పంజరస్తోత్రం శివునికి విష్ణువు చెప్పినటువంటిది.

ఏ దిక్కున ఎలా విష్ణువు రక్షించాలి.

రకరకాల ఆయధాలు ఇందులో పట్టుకున్నాడు. హలము, ముసలము – రోకలి, నాగలి పట్టుకున్న స్వరూపం – బలరామ కృష్ణ స్వరూపం;

వరాహ స్వరూపం;

నృకేసరీన్ – నరకేసరీ స్వరూపం – మహానరసింహ స్వరూపం;

స్వామి మహామీన – మత్స్యావతారం;

దశదిశలలో, ఇత్యాది స్థానములలో నారాయణుడు ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు.


🌹ఇందులో బీజాక్షర సంపుటిలు లేవు.

అంటే పెద్ద నియమాలు, బాధలు లేవు.

రోజూ స్నానం చేసి శుద్ధంగా చదువుకుంటే చాలు. 


🌹ఇది గౌరీదేవి శివునియొద్ద ఉపదేశం పొంది చదివింది.

అసుర సంహార సమయంలో దేవతలు విష్ణు పంజర స్తోత్రం చదువుకున్నారు.


🌹విష్ణు పంజరం స్తోత్రాన్ని మంత్రం వలె శ్రద్ధ భక్తులతో జపించే వారు ప్రతి దశలోనూ విజయాన్ని పొందుతారు.

                    ⚜️🌹⚜️🌹⚜️🌹⚜️🌹⚜️🌹⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు