త్ర్యంబకేశ్వరుడు🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏
🕉️🔱🚩 ఓం నమః శివాయ 🌹🙏
⚜️🚩త్ర్యంబకేశ్వరుడు🌹
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే ।
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ॥
⚜️🚩 బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ కొలువైన ప్రదేశం కనుకనే దీనిని "త్రయంబకం" అంటారు.
ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు.
ఆ స్థానంలో రుబ్బురోలు లోపలి భాగంవలె గుంటతో లోతుగా ఉంటుంది.
అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలి వంటి) లింగాలు ఉంటాయి.
🌹నాసిక్ (మహారాష్ట్ర) గౌతమీ తీరాన ఈ ఆలయం ఉంటుంది.
🌹నాసిక్:
వనవాసంలో ఉన్న శ్రీరామచంద్రుల వారు సీతా, లక్ష్మణ సేమేతంగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా,
లంకేశ్వరుని సోదరి శూర్పణఖ శ్రీరాముని కామించగా,
అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసి, ఇంటిదారి పట్టించాడు.
శూర్పణఖ ముక్కు (నాసిక) కోసిన ప్రాంతమే నేడు ‘నాసిక్’గా పిలువబడుతోంది.
🌹గౌతమీ నది:
బ్రహ్మగిరి అనే పర్వత శిఖరాగ్రాన గౌతమమహర్షి అహల్య సమేతంగా తపస్సు చేస్తున్న సమయంలో...
జన హితం కోరి, గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు.
🌹గౌతమమహర్షి తన ఆశ్రమంలో వరిపైరును సాగుచేస్తున్నాడు.
ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు.
తపస్సులో నున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా, దర్భ తాకినంతనే అవి చనిపోయాయి.
మునుల పన్నాగం ఫలించింది.
గోహత్యాపాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి, ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు.
వెయ్యేళ్ళు శివుని ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి.
గౌతమ మునీంద్రుల తపస్సువలన భూమికి తీసుకురాబడి నందున కారణంగా "గౌతమీనది" అని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా "#గోదావరి" అని ప్రఖ్యాతి చెందింది.
🌹గంగ శంకరుని వంక చూసి స్వామీ! గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను.
మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి.
33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి అన్నది.
శివుడు తప్పకుండా అలాగే వెలుస్తాను అన్నాడు.
స్వామి త్ర్యంబకుడనే పేరుతో వెలిసాడు.
🌹త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని, ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు.
🌺🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌺
⚜️🌹🔱🕉️🔱🌹⚜️

Comments
Post a Comment