కార్తవీర్యార్జునుడు ని అనుగ్రహించిన దత్తాత్రేయుడు

 🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః🌹🙏


🌹ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః 🌹


⚜️🚩ప్రజలు ధర్మబద్ధంగా జీవించాలి.

దానికి రకరకాల ఆటంకాలు ఏర్పడుతుంటాయి.

వాటిని తొలగించడానికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలను ఆ భగవంతుడే ఎత్తుతుంటాడు.


🌹సృష్టి పొడుగునా అటువంటి అవరోధాలు సాధ్యమైనంతవరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువుగా అవతరిస్తాడు.

తన లీలల ద్వారా సాధ్యమైనంత ఎక్కువమందికి మోక్షం మీద కోరిక కలిగిస్తాడు.

ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు.

ఈ విధంగా మహాత్ములుగా అవతరించే భగవత్తత్వమే "దత్తాత్రేయుడు" 


⚜️🚩ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా దుఃఖాలు కలుగుతాయని పురాణాలు తెలియజెబుతున్నాయి.

ఇదే శ్రీ దత్తావతరానికి నాంది.


🌹నాలుగు యుగాల్లో మొదటిదైన కృతయుగం ఆరంభంలోనే జన్మించాడు దత్తుడు.


🌹ధర్మ స్వరూపమైన గోవు ఒక పక్క,

చుట్టూ నాలుగు వేదాలకు సంకేతాలైన కుక్కలతో,

అత్యంత దివ్యమైన రూపంతో పరమయోగి, దిగంబరుడు, బ్రహ్మచారి అయిన శ్రీదత్తుడు గోచరిస్తాడు.

మూడు తలలు కలిగి ఉంటాడు.


🌹శ్రీగురుదత్త, జయగురుదత్త అంటే ఆయన వెంటనే పలుకుతాడని ఎందరో విశ్వసిస్తారు.

స్మరించినంత మాత్రానే అనుగ్రహించే స్వభావం కలవాడు దత్తాత్రేయుడు.

అయితే ఆయన పరీక్షించి కాని భక్తులకు వశం కాడని ప్రతీతి.


⚜️🚩కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యార్జునుడు

కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శనచక్రం యొక్క అంశ.

తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో

అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు.

కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. 


🌹కృతవీరుడు మరణించగానే పట్టాభిషేకం చేస్తాం అన్నారు.

ఇంతమంది ప్రజలను నేనెలా పరిపాలించ గలను?

అంత శక్తి నాకు ఉందా? అన్నాడు.

అప్పుడు గర్గుడు అనే మహానుభావుడు నీకు శక్తి కావాలంటే "దత్తాత్రేయ" అనుగ్రహం పొందమన్నారు.


🌹శ్రీ దత్తాత్రేయ స్వామి ఇచ్చే అనుగ్రహం ఎవ్వరూ ఇవ్వరు. కానీ పరీక్షిస్తారు.

కార్తవీర్యార్జునుడు బయలుదేరి వెళ్తే స్వామి వారు మాంసం కోస్తున్నారు.

ఇంకొకసారి వెళ్తే మద్యపానం చేస్తున్నట్లుగా కనపడ్డారు.

ఇంకొకసారి వెళ్తే ఒక ఆడపిల్లని దగ్గర కూర్చోబెట్టుకొని ముద్దులాడుతున్నాడు. 


🌹పరీక్ష చేశారు స్వామి.

మాంసం తెచ్చి కుండలో పెట్టి ఇది వండి పెట్టమన్నారు. 

వండుతూ ఉంటే రెండు చేతులూ కాలినై.

చూశావా నువ్వు మంచి సనాతన సంప్రదాయంలో పుట్టిన వాడివి.

నేను భ్రష్టుడిని, నా దగ్గరికి వచ్చావు చేతులు కూడా కాలినై.

నువ్వు పాడయిపోతావు.

ఇంటికెళ్ళు నాయనా అన్నారు.


🌹బాగా పట్టుబట్టాడు. కాలు పట్టుకున్నాడు. వదలలేదు. ఎముకలు తీసుకొని కొట్టారు. గాయాలైనా వదలలేదు.

అప్పుడు స్వామి అనుగ్రహించాడు.


🌹దత్త భక్తి గలవారు దృఢమైన భావంలో ఉండాలి.

ఉంటే వారిని సర్వదా రక్షిస్తాడు స్వామీ. 


⚜️🚩సర్వశక్తులూ సర్వ అనుగ్రహాలు, సర్వ రాజ్య పదవులూ, సమస్త భోగాలూ దత్తాత్రేయుల వారిని సేవించడం వల్ల పొందగలుగుతారు.


🌹ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే నమో నమః 🌹

                            🕉️🌼🌺🔱🌺🌼🕉️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు