⚜️🚩తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. (శ్రీకాళిదాస కృత రఘువంశం లోని కథ)
🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
⚜️🚩తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు.
(శ్రీకాళిదాస కృత రఘువంశం లోని కథ)
🌹రఘువంశపు రాజు అయినా "దిలీపుని"కి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు.
తన అర్థాంగి అయిన "సుదక్షిణాదేవి"తో సహా సద్గురు దర్శనం కోసం "వసిష్ఠ మహర్షి" ఆశ్రమానికి వెళ్ళాడు.
తనకుగల చింతను వ్యక్తపరచాడు.
ఒక్క నిమిషము ధ్యానము చేసి వసిష్ఠుల వారు ఇలా అన్నారు
“నాయనా! నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును🐄 గమనించలేదు.
గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి.
ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా?
సర్వధర్మాలు తెలిసిన నీవు వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు.
ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు.
నీచే పూజ్య పూజావ్యతిక్రమము జరిగినది.
పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా.
🌹అప్పుడు కామధేనువు “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు.
నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని చెప్పినది.
కానీ రథవేగము వలన వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికి గానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు.
నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు.
చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగతిపథంలో నడిచేవాడు ఉత్తముడు.
కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు.
వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది.
ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీ ధేనువును సేవించి తరించు”
ఇలా వసిష్ఠులవారు హితవు చెప్తుండగానే
🌹ఆ నందినీ ధేనువు రానే వచ్చింది.
దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీ ధేనువును సేవించుట ప్రారంభించారు.
ఆ రాజదంపతులు నందినీ ధేనువును నీడ లాగా అనుసరించి సేవించారు.
ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీ ధేనువును ఆరాధించారు.
ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు.
🌹వారి సేవకు సంతోషించిన నందినీ ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది.
త్రుటిలో ఒక సింహం🦁 ఆ హోమధేనువు మీద పడబోయింది.
వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు🏹 తీయబోయాడు.
కానీ ఆశ్చర్యం!
చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు.
ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు.
🌹ప్రగల్భముగా అప్పుడు సింహం🦁
“రాజా! గిరిజాపతి ఆజ్ఞపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను.
శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు.
నేను మామూలు సింహాన్ని కాను.
ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాద పీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు.
నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను.
పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు.
ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది” అన్నది.
🌹“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నవే!
ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానే” అని అనుకుంటున్న రాజు
“నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు.
“భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!” అని అనుకున్నాడు.
🌹ఆ కుంభోదరునితో “ఓ దివ్య సింహమా! సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకు కూడా పరమ పూజ్యుడు.
కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా!
మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను.
నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురు ధనమైన ఈ నందినీ ధేనువును వడిచిపెట్టు” అన్నాడు.
🌹ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు.
నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి.
యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు.
ఒక్క గోవు🐄 కోసం అన్నీ వదులుకుంటావా?
అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు?
ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు.
నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా?
నీకు ఎట్టి అపకీర్తి రాదు. గురుద్రోహం అంటదు”
అని అన్నాడు దిలీపుని ప్రలోభపెడదామని.
🌹అది విని ధర్మాత్ముడైన దిలీపుడు “క్షతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు.
అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు?
అదీ కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తూన్న ప్రాణాలు ఎందుకు?
ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి.
నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు” అని అన్నాడు.
🌹ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం.
స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు.
తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుఱు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది.
🌹నందినీ ధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హాని కలిగించలేదు.
నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను.
నీ భక్తితో నన్ను మెప్పించావు.
దివ్యమైన నా క్షీరము స్వీకరించు.
సంతానవంతుడివి అవుతావు” అని అన్నది.
🌹 “తల్లీ! నీ కరుణ అమోఘం.
నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు.
లేగ దూడ నీ పాలకై ఎదురు చూస్తుంది.
మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు.
వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆరో వంతు తీసుకుంటాను.
(ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”.
“తథేతి” అని ఆశీర్వదించింది నందినీ.
ధేనువ్రత మహిమ వలన "రఘు మహారాజు"ను పుత్రునిగా పొందినాడు దిలీపుడు.
🌹సేకరణ
⚜️🚩కావున పెద్దలను సాధు సజ్జనులను గోవులను🐄 ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి.
⚜️🌺🕉️⚜️🕉️🌺⚜️

Comments
Post a Comment