⚜️🚩సకల పాపనాశని స్వామి పుష్కరిణి🌹🙏

 🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


🌹కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడు.

భక్తుల పాలిట కల్ప వృక్షం.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి🌹🙏


🌹తిరుమలలో ప్రతీ శిల చింతామణి,

ప్రతీ చెట్టు, ప్రతీ తీగ మహర్షులు,

ప్రతీ తీర్థం దేవగంగా స్వరూపాలని, వేంకటాచల మహాత్మ్యములో తెలుపబడినది.


🌹అత్యంత పావనము సర్వకామదాయకాలైన అరవై ఆరు కోట్ల తీర్థాలు తిరుమలక్షేత్రంలో ఉన్నాయని బ్రహ్మపురాణం మనకు తెలియజేస్తోంది.


🌹తిరుమలలో తీర్థాలు నాలుగు విధాలుగా మనకు దర్శనమిస్తున్నాయి.

1) ధర్మరతి తీర్థాలు 2) జ్ఞానప్రదాలు

3)భక్తివైరాగ్యప్రదాలు 4)ముక్తిప్రదాలు.


🌹ధర్మరతి తీర్థాలు:

ఇవి 1008 తీర్థాలు. ఈ తీర్థాల్లోని నీటిని తాగినా, వాటి సమీపంలో నివసించినా, సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదిస్తాయి.


🌹జ్ఞానప్రదాలు:

ఇవి భక్తియోగసాధన ద్వారా తరింపబడే తీర్థరాజములు. ఇవి 108 తీర్ధాలు.

 

🌹భక్తివైరాగ్యప్రదాలు:

ఈ తీర్థస్నానం పరమేశ్వరునిపై భక్తి, సంసారంపై విరక్తిని కలిగిస్తుంది. ఇవి 68 తీర్థాలు.

 

🌹ముక్తిప్రదాలు:

పూర్వోక్తాలైన పుణ్య తీర్థములకన్నా సప్తతీర్థాలు (7) ముక్తి సాధనానికి శ్రేష్ఠమైనవి.


⚜️🚩సకల పాపనాశని స్వామి పుష్కరిణి🌹🙏


వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ,

తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన.


ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది.


దీని దర్శనం, స్పర్శనం, స్మరణం కూడా సర్వాభీష్టాలను అనుగ్రహిస్తుంది.


తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు.

                   🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️


వినా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి ।


హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥🌹🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు