సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః🌹

 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


🕉️🌺 ఓం సరస్వత్యై నమః 🌺🕉️


🔱🚩సరస్వతి దేవి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి.

వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవత.

చదువుల తల్లి. జ్ఞాన ప్రదాత.


🌹పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతిదేవి ఒకటి.

ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వ శక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుంది.


🌹బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ.

సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది.

సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.


🌹సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః🌹


🌹ధ్యానమ్:

నీహార ఘన సార సుధాకరాభ్యాం

కల్యాణదాం కనక చంపక దామ భూషామ్ |

ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీం

వాణీం నమామి మనసా వచసాం విభూత్యై ||


యా వేదాన్తార్థ తత్వైక స్వరూపా పరమార్థతః|

నామ రూపాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ || 1 ||


యాసాం గోపాంగవేదేషు చతృష్వేకైవ గీయతే |

అద్వైతా బ్రాహ్మణ శ్శక్తిః సా మాం పాతు సరస్వతీ || 2 ||


యా వర్ణ పద వాక్యార్థ స్వరూపెణైవ వర్తతే |

అనాది నిధనానన్తా సా మాం పాతు సరస్వతీ || 3 ||


అధ్యాత్మ మధి దైవం చ దేవానాం సమ్యగీశ్వరీ|

ప్రత్యగాస్తే వదన్తీ యా సా మాం పాతు సరస్వతీ || 4 ||


అన్తర్యామ్యాత్మనా విశ్వం త్రైలోక్యం యా నియచ్ఛతి|

రుద్రాదిత్యాది రూపస్థా యస్యా మావేశ్యతాం పునః |

ధ్యాయన్తి సర్వరూపైకా సా మాం పాతు సరస్వతీ || 5 ||


యా ప్రత్య గ్దృష్టిభి ర్జీవైః వ్యజ్యమానాను భూయతే |

వ్యాపినీ జ్ఞప్తిరూపైకా సా మాం పాతు సరస్వతీ || 6 ||


నామ జాత్యాదిభి ర్భేదైః అష్టదా యా వికల్పితా|

నిర్వికల్పాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ || 7 ||


వ్యక్తావ్యక్తగిరః సర్వే వేదాద్యా వ్యాహరన్తి యామ్|

సర్వకామదుఘా ధేనుః సా మాం పాతు సరస్వతీ || 8 ||


యాం విదిత్వాఖిలం బంధం నిర్మధ్యాఖిలవత్మనా|

యోగీ యాతి పరం స్థానం సా మాం పాతు సరస్వతీ || 9 ||


నామ రూపాత్మకం సర్వం యస్యా మావేశ్యతాం పునః|

ధ్యాయన్తి బ్రహ్మరూపైకా సా మాం పాతు సరస్వతీ || 10 ||

                             🌺🕉️🔱🕉️🔱🕉️🌺



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు