ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏 💥భగవంతుడు సర్వాంతర్యామి.. జగత్తంతా నిండి, నిబిడీకృతమై ఉన్నాడని చాటి చెప్పడమే "శ్రీ నరసింహావతార" ఉద్దేశం. తన పుత్రుడి నోట శత్రువు మాట విన్న హిరణ్య కశిపుడికి క్రోధం నిలువెల్లా పాము విషమై కమ్ముకోగా, తన గదను విసురుగా ఎత్తి, స్తంభానికి బలంగా తాటించాడు. స్తంభంలో నుంచి ఆవిర్భవించిన శ్రీ నృసింహుడు భీకరంగా హిరణ్య కశిపుని ఒడిసిపట్టి, తన ఒడిలో పెట్టుకొని, వజ్రాల్లాంటి గోళ్లతో చీల్చి చెండాడాడు. ఆ సమయంలో స్వామి ముఖం పరమ భీకరంగా ఉంది. రక్తాన్ని పులుముకొన్న గోళ్లు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని పోలి ఉన్నాయి. హిరణ్యకశిపుడి కడుపు నుంచి వేరు చేసిన పేగులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. ఆ ఉగ్రమూర్తి నిట్టూర్పులు పెనుగాలుల్లా వీచాయి. జూలు నుంచి రక్తం ధారలు కడుతోందని పురాణ వచనం. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు. పలువిధాల స్తుతించాడు. స్వామి ప్రసన్నుడై శాంతించాడు. నరసింహుడు ఉగ్రరూపుడైనా భక్తుల మనోభీష్టాలు నెరవేర్చడంలో కరుణా సముద్రుడు. 💥త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళ...

Comments
Post a Comment