వినాయకుని ఆసనంలో అంతరార్థం
ఓం గం గణపతయే నమః 🙏 ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకమ్ భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే వినాయకుని ఆసనంలో అంతరార్థం లలితాసనం చాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది. ఒక పక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు. ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలడమే నిజమైన సవాలు. తనను కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని స్వామి హామీ ఇస్తున్నాడు. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు. అభంగం స‌్థిరంగా నిల్చొని ఉన్న గణపతి రూపాన్ని "అభంగ" అంటారు. తాను చూడటానికి భారీకాయంతో ఉన్నా తన మనస్సు ఆ శారీరక పరిమితులకు లోబడదని గణ...