ఓం నమః శివాయ (కాశీ విశ్వనాథుడు)

 ఓం నమః శివాయ 🙏


            కాశీ విశ్వనాథుడు🙏

అయోధ్య, మథుర, గయ, కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్త ముక్తి నగరాలు అంటారు.


తురుష్కులు దండయాత్రకు వస్తున్నారని విని విశ్వనాథుని సేవించుకుంటున్న అర్చకులు, ఋషులూ అక్కడ విగ్రహానికి హాని కలుగకూడదని, ఇంకొకచోట భద్రపరచే ఉద్దేశ్యముతో పెకలించబోయారు. 

కాని విశ్వనాథుడు కదలలేదు. 


ఏంచేయాలో తెలియని భక్తులు "మా ప్రాణాలు తీసి కాని స్వామిని ముట్టనివ్వం" అని ఆస్వామిని కౌగలించుకుని ఉండిపోతే... అప్పుడు విగ్రహములో కదలిక వచ్చింది.


వెంటనే విగ్రాహాన్ని పెకలించి ప్రక్కనున్న నూతిలో దాచారు. తురుష్కులు వచ్చి ముట్టడించారు. చేయదలచిన విధ్వంసం చేసి వెళ్ళారు.


ఆ తర్వాత పునః ప్రతిష్ట చేద్దామంటే స్వామి నూతిలో కనపడలేదు.


రాణీ అహల్యాబాయి కి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి తాను ఆ కూపం (జ్ఞానవాపి) లో

లుప్తమయ్యానని, గుడి కట్టించి ఇంకో లింగాన్ని ప్రతిష్ట చేయమని ఆదేశించాడట. 


ఆ ప్రకారం అన్నీ ఏర్పాట్లు చేసి లింగాన్ని తెచ్చి ఒక ప్రక్కగా పెట్టి గర్భగుడి మధ్యభాగంలో ప్రతిష్ట చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారుట.


అంతా అయ్యాక లింగప్రతిష్ట చేద్దామంటే ముందు పెట్టిన స్థలంలోంచి ఆ స్వామి కదలలేదట.

ఆ స్థలమే తనకి ఇష్టమైనదని అక్కడే అలాగే దాన్ని ఉంచి అర్చించమని స్వప్నంలో అహల్యాబాయికి చెప్పాడట స్వామి.



 

ఆ కారణంగా గర్భగుడిలో ఒక ప్రక్కకు ఉంటాడు విశ్వనాథుడు.

ముందుగా ప్రతిష్టింపబడిన నందీశ్వరుడు మామూలుగా ఎదురుగానే ఉంటాడు.


భక్తుల అభిషేక జలాలతో తడిసిన అభిషేక ప్రియుడు తన శిరోభాగాన్ని మాత్రమే చూపుతూ ఉంటాడు. 

ఒకసారి ఆ నీరు అర్చకులు తీసేసినప్పుడు పూర్తి స్వామి కన్నులపండువగా దర్శనమిస్తాడు.


కాశ్యాన్తు మరణాన్ ముక్తి  

"కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" అని నమ్మకం.

                   

గంగా తరంగ రమణీయ జటా కలాపం

గౌరీ నిరంతర విభూషిత వామ భాగం|

నారాయణ ప్రియమనంగ మదాపహారం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్||

                   

                                                          -- సత్య వాడపల్లి

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు