గోవింద రాజ స్వామి (ఓం నమో వేంకటేశాయ)

  ఓం నమో వేంకటేశాయ 🙏


            గోవిందరాజ స్వామి 🙏


గోవిందరాజస్వామినీ  శ్రీవేంకటేశ్వరునికి అన్న అని పిలుస్తారు. 

తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడట.

ఎంత సేపు కొలిచినా పని పూర్తికాక అలసిపోయి... 

కొలమానికను తల కింద పెట్టుకుని శయనించినట్లు కథనాలున్నాయి.




సప్తగిరుల పైన శ్రీవారు కొలువుతీరి ఉండగా, పర్వత పాదాల వద్ద ఆయన సోదరుడు శ్రీగోవిందరాజస్వామి వెలసి ఉంటారు. 


గోవిందరాజస్వామి విగ్రహం శేషశాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తరదిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకుని, శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభికమలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి.


క్రిమికాంతకుడనే చోళరాజు, తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని భావించి, చిదంబరంలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. 


వైష్ణవ మతాచార్యులు రామానుజాచార్యుల వారు... రాజును వేడుకుని అక్కడి  గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తిని తీసుకుని తిరుపతి వచ్చారు.


మూలవిరాట్టును మలచే పనిని కొందరు నిష్ణాతులైన శిల్పులకు అప్పగించారు. 

అందులో కొన్ని లోపాను గుర్తించిన రామానుజుల వారు మరో విగ్రహాన్ని చెక్కాలని సూచించారు.


కొన్ని అనివార్య కారణాల వల్ల రామానుజుల వారు దేశ పర్యటనకు వెళ్ళాల్సి సమయం ఆసన్నమవడంతో... మరో విగ్రహాన్ని చెక్కించే అవకాశం లేక సుద్ద తో మూర్తిని చేసి ప్రతిష్టించారు. 

నాటి నుంచి నేటి వరకూ సుద్ద విగ్రహమే గోవింద రాజస్వామి ఆలయంలో పూజలు అందుకుంటుంది. 


అందుకే ఇక్కడ స్వామికి అభిషేకాలు ఉండవు. నూనెను మాత్రమే పూస్తారు.


లేని ఐశ్వ‌ర్యాన్ని పొందాల‌న్నా, ఉన్న‌దాన్ని పెంపొందించుకోవాల‌న్నా... గోవింద‌రాజ‌స్వామి అనుగ్ర‌హం ఉంటుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. 


అంతేకాదు వేంక‌టేశ్వ‌రుని క‌ళ్యాణానికి ముల్లోకాల‌లోనూ ఉన్న దేవత‌లంద‌రినీ ఆహ్వానించార‌ట గోవింద‌రాజుల‌వారు. 

అందుక‌ని గౌర‌వ‌నీయులైన వ్య‌క్తులతో స్నేహబంధాలు కోరుకునేవారికి కూడా ఆయ‌న ఆశీస్సులు ఉప‌యుక్తంగా ఉంటాయ‌ని న‌మ్ముతారు.

              

             శ్రీభూమినాయకదయాకరదివ్యమూర్తె

                 దేవాధిదేవజగదేక శరణ్య విష్ణో |

              గోపాంగనాకుచసరోరుహభృంగరాజ

            గోవిందరాజ విజయీ భవ కోమలాంగ||

       

                                                       -- సత్య వాడపల్లి

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు