ఓం నమః శివాయ (శివ మానస పూజ స్తోత్రం)

 ఓం నమః శివాయ 🙏

శివ మానస పూజ 

మనసులో భగవంతుని నిలుపుకోవటం అలవాటు చేసుకోవటానికి, మనసు నిశ్చలంగా వుండటానికి ప్రత్యక్షంగా విగ్రహాన్ని పూజించాలి.


అనేక కారణాలవల్ల అందరికీ ప్రతిరోజూ యధావిధిగా పూజ చేయటం కుదరకపోవచ్చు.


వృధ్ధాప్యంవల్ల, అనారోగ్యంవల్ల, ప్రయాణంలో, ఇలా కూర్చుని అభిషేకమూ, అర్చనా చేసే అవకాశం లేక పోయినా, చెయ్యాలనే తపన మాత్రం ఉంటుంది.


అలా కుదరనప్పుడు, మన మానసిక శక్తిని పరీక్షించుకోవటానికి, భగవంతుణ్ణి మన మనసులో నిలుపుకోవటానికి భగవంతుడు కల్పించిన అవకాశంగా భావించి #మానసిక_పూజ చేసుకోవాలి


అసలు భగవంతుని పూజలో మానసికపూజయే విశేషమయినది. 

అది ఎలా అంటే...


భగవంతుడు అక్కడ వున్నాడని భావించి ఆయనకి రత్నసింహాసనం వెయ్యాలి. 

ఆకాశగంగని తెచ్చి మనసారా  అభిషేకించాలి. 

వివిధ రకాల ఆభరణాలతో అలంకరించాలి.


సుగంధ భరితమైన పూవులతో, మారేడు దళాలతో పూజించాలి. 

ధూపం, దీపం అన్నీ సమర్పించాలి. 

షడ్రషోపేతమైన వివిధ భక్ష్యభోజ్యాలను, మధుర ఫలాలను నివేదించాలి. 


"స్వామీ, నేను చేసిన వివిధ సపర్యలు స్వీకరించి నాపై దయచూపమని వేడుకోవాలి. 

బాహ్యంగా  పూజ చేసే అవకాశం లేనివారు బాధపడకుండా భగవంతుడు అది మనకిచ్చిన అవకాశంగా తీసుకుని భగవంతుని మనసులో నిలుపుకుని పూజించవచ్చు.

                 


"శివ మానస పూజ స్తోత్రం" అనేది  శ్రీఆదిశంకరాచార్యులు రాసిన భక్తి శ్లోకం. 

"మానస పూజ" అంటే బాహ్య పదార్థాలు లేకుండా భగవంతుడిని ఆరాధించడం.

సాధారణంగా జరిగే పూజ మొత్తం మనసులొ

ఊహించడం. 

ఈ రకమైన ఆరాధనకు ఎక్కువ ఏకాగ్రత అవసరం.




 🔱🌺 శివ మానస పూజ స్తోత్రం 🌺🔱


రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం

నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ ।

జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ||


సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం

భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ ।

శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం

తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ||


ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం

వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా ।

సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా

సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||


ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః ।

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ||


కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ ।

విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ

జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||

                              🔱🌺 🔱🌺🔱

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం