ఓం నమః శివాయ (రుద్ర శివమంత్రం)🙏
ఓం నమః శివాయ 🙏
ఓం "నమఃశివాయ" మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు.
ఇదే పంచాక్షరీ మహామంత్రం.
అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం.
👉ఓం... మహాబీజాక్షరం.
ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు.
న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు.
మానవ శరీరం పంచభూతాత్మకం.
నమఃశివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది.
‘న’ భూమికి సంబంధించిన భాగాలను, ‘మ’ నీటికి సంబంధించిన భాగాలను, ‘శి’ అగ్నికి సంబంధించిన భాగాలను, ‘వ’ గాలికి సంబంధించిన భాగాలను, ‘య’ ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి.
మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు.
అందువల్లే "ఓం నమఃశివాయ" అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు.
రుద్ర శివమంత్రం
'ఓం నమో భగవతే రుద్రాయ'
ఈశ్వరుడి అత్యంత శక్తిమంతమైన మంత్రాల్లో ఇది ఒకటి. కోరిన కోరికలు ఫలించాలంటే ఇంతకు మించిన మరో అద్భుత మంత్రం లేదని అంటారు.
గాయత్రీ శివమంత్రం
'ఓం మహాదేవాయ విద్మహే రుద్ర మూర్తయే
ధీమహి తన్నో శివ ప్రచోదయాత్'
ఈ "గాయత్రీ శివ మంత్రం" చాలా శక్తిమంతమైంది.
ఈ మంత్రం పఠిస్తే పరమ శివుడు సుప్రసన్నుడు అవుతాడు. మనశ్శాంతి కలుగుతుంది.
శివధ్యాన శివమంత్రం
"కర్చరాంకృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా పరధాం
విహితం విహితం వా సర్వ మేతత క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహదేవ్ శంభో"
ఈ మంత్రం పఠిస్తే పరమశివుడు తృప్తి చెంది పాపాల నుంచి పరిహరిస్తాడు.
-- సత్య వాడపల్లి
Comments
Post a Comment